Mpox Case Detected In Kerala : భారత్‌లో రెండో ఎంపాక్స్ కేసు నమోదు అయింది. కేరళలోని మలప్పురం జిల్లాలో మరో కేసు నమోదైనట్లు ఆరోగ్యశాఖ నిర్ధరణ చేసింది. ఇటీవలే యూఏఈ నుంచి వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి మంకీ పాక్స్ వైరస్ సోకిందని, ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందితున్నట్లు కేరళ ఆరోగ్య శాఖమంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.
టీకాలు ఉన్నాయా?
జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వెన్నునొప్పి, తీవ్ర చలి, అలసట, చర్మంపై పొక్కులు వంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. ప్రస్తుతం మంకీపాక్స్ నివారణకు రెండు రకాల టీకాలు ఉన్నాయి. వీటిని గత వారమే ప్రపంచ ఆరోగ్య సంస్థ స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ అత్యవసర వినియోగానికి లిస్టింగ్ చేసింది.