ETV Bharat / snippets

యూపీఎస్సీ తన అభ్యర్థిత్వం రద్దు చేయడంపై - దిల్లీ హైకోర్ట్​లో పూజా ఖేడ్కర్ సవాల్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 7, 2024, 12:33 PM IST

Puja Khedkar
Puja Khedkar (ANI)

Puja Khedkar : మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్‌, యూపీఎస్సీ తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్​పై జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పూజా ఖేడ్కర్‌ తరపున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు. ఖేడ్కర్‌ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు ఇప్పటి వరకు ఆమె చేతికి అందలేదని, రద్దుపై కేవలం పత్రిక ప్రకటనను మాత్రమే విడుదల చేశారన్నారు. ఆమెకు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు.

యూపీఎస్సీ తరఫున న్యాయవాది నరేష్ కౌశిక్ వాదనలు వినిపించారు. పూజా ఖేడ్కర్‌ ఆచూకీ తెలియనందున పత్రికా ప్రకటన విడుదల చేసినట్లు వెల్లడించారు. పత్రికా ప్రకటన ఆమె అభ్యర్థిత్వం రద్దుకు సంబంధించిన అధికారిక సమాచారమని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.