President Murmu Fijis highest civilian award : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారం "కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీని" అందుకున్నారు. రెండు రోజుల ఫిజీ పర్యటనకు వెళ్లిన ముర్ముకు ఆ దేశ అధ్యక్షుడు విలియమ్ కటోనివేరే ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ద్వీప దేశమైన ఫిజీలో భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారి. ఫిజీ, భారత్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. ఫిజీకి మిత్రదేశంగా ఉండటానికి భారత్ సిద్ధంగా ఉందని ఆ దేశ పార్లమెంట్‌లో పేర్కొన్నారు. తనకు లభించిన పురస్కారాన్ని రెండు దేశాల మధ్య ఉన్న గొప్ప స్నేహ బంధానికి ప్రతిబింబంగా ద్రౌపదీ ముర్ము అభివర్ణించారు. ఫిజీ పర్యటన అనంతరం ఆగస్టు 7 నుంచి 9 వరకు న్యూజిలాండ్‌లో రాష్ట్రపతి పర్యటించనున్నారు.
భారత రాష్ట్రపతికి అరుదైన గౌరవం- ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న ద్రౌపదీ ముర్ము
Published : Aug 6, 2024, 7:25 PM IST