PM Modi Releases 109 Climate Resilient Seed : వ్యవసాయ దిగుబడులను పెంచడం సహా, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా అభివృద్ధి చేసిన వివిధ రకాల వంగడాలను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. అధిక దిగుబడి, వాతావరణ మార్పులను తట్టుకోగలగడం సహా అధిక పోషక విలువలు కలిగిన 109 రకాల వ్యవసాయ, ఉద్యానవన పంటల విత్తనాలను ప్రధాని ఆవిష్కరించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి- ICAR ఈ వంగడాలను అభివృద్ధి చేసింది.
ఇందులో స్వల్పకాలిక పంటలకు సంబంధించి 61 రకాలు, 34 ఫీల్డ్ క్రాప్స్, 27 ఉద్యానవన రకాలు ఉన్నాయి. దిల్లీలోని పుసా ప్రాంగణంలో ప్రధాని మోదీ ఈ వంగడాలను ఆవిష్కరించారు. అనంతరం రైతులు, శాస్త్రవేత్తలతో చర్చించారు. ప్రకృతి సేద్యాన్ని పెంపొందించడం సహా, ఆర్గానిక్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.