Jai Hind in Haryana schools : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హరియాణా ప్రభుత్వం కీలక ప్రకటన వెలువరించింది. ఆగస్టు 15 నుంచి అన్ని పాఠశాలల్లోని విద్యార్థులు టీచర్లకు, తోటి స్నేహితులకు పలకరింపుగా 'గుడ్ మార్నింగ్'కు బదులుగా 'జై హింద్' అని చెప్పాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్య డైరెక్టరేట్ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి, దేశంపై గౌరవం, ఐక్యతా భావాలను పెంపొందించాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 15న జాతీయజెండాను ఎగురవేసే ముందు నుంచి ఈ సూచనలను అమలు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇకపై పాఠశాలల్లో 'గుడ్ మార్నింగ్'కు బదులు 'జైహింద్'
Published : Aug 10, 2024, 7:26 AM IST