Woman Climbs Water Tank For Marriage : రాజస్థాన్‌లో ఓ మహిళ తనకు పెళ్లి చేయాలని వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి మరీ డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఎలాగోలా ఆ మహిళను ఒప్పించి కిందకు తీసుకొచ్చారు.
భరత్‌పుర్‌కు చెందిన ఆ మహిళ వయసు 35 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇంకా ఇప్పటివరకు వాళ్ల తల్లిదండ్రులు పెళ్లి చేయడం లేదనే కోపంతో వాటర్ ట్యాంక్ ఎక్కినట్లు చెప్పారు. తాను బీఈడీ చదివిందని, కనీసం పోటీ పరీక్షలకు ప్రీపేర్ అవ్వకుండా తల్లిదండ్రులు చేస్తున్నారని ఆరోపించింది. ప్రస్తుతం తాను తల్లిదండ్రుల వద్ద ఉండటం లేదని చెప్పింది.