Footwear Thieves Arrested Karnataka : మనం ఇప్పటి వరకు బంగారం, నగదు, చైన్, బైక్ వంటివి ఎత్తుకెళ్లే దొంగలనే చూశాం. కానీ బెంగళూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు మాత్రం బ్రాండెడ్ షూస్నే టార్గెట్‌గా పెట్టుకున్నారు. గత ఏడేళ్లుగా దొంగలించిన షూస్‌ను కొత్తవిగా మార్చి బెంగళూరు, చెన్నై, ఊటీ నగరాల్లో విక్రయిస్తున్నారు. షూస్‌తో పాటు ఇళ్ల బయట ఉంచిన చెప్పులు, వాహనాల బ్యాటరీలు, సిలిండర్లు కూడా చోరీ చేస్తున్నారు. ఇటీవల ఈ విషయంపై బెంగళూరులోని విద్యారణ్యపుర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా, ఆ ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.10.72లక్షల విలువైన 715 బ్రాండెడ్ షూస్ జతలను స్వాధీనం చేసుకున్నారు.
'బ్రాండెడ్' షూసే వారి టార్గెట్- 7ఏళ్లుగా అదే పని- మీవేమైనా పోయాయా?
Published : Jul 20, 2024, 7:16 AM IST