Centre Curtails Tenure Of BSF DG : సరిహద్దు భద్రతా దళం (BSF) డైరెక్టర్ జనరల్ (డీజీ) నితిన్ అగర్వాల్, ప్రత్యేక డీజీ (పశ్చిమ) వై.బి.కురానియాలపై కేంద్రం వేటు వేసింది. వారిని తిరిగి రాష్ట్ర క్యాడర్లకు పంపించింది. అగర్వాల్ 1989 బ్యాచ్ కేరళ క్యాడర్ అధికారి. కురానియా 1990 బ్యాచ్ ఒడిశా క్యాడర్‌కు చెందినవారు. గతేడాది జూన్‌లో బీఎస్‌ఎఫ్ డీజీగా అగర్వాల్ బాధ్యతలు స్వీకరించారు. పాక్ సరిహద్దు వెంబడి దళాలకు ప్రత్యేక డీజీగా కురానియా నియమితులయ్యారు. పదవీ కాలాలు ముగియకముందే వారిని తక్షణం రాష్ట్ర క్యాడర్లకు పంపిస్తున్నట్లు క్యాబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జమ్మూ ప్రాంతంలో, భారత్-పాకిస్థాన్ సరిహద్దు వెంబడి జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలోనే కేంద్రం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రాజౌరీ, పూంఛ్, డోడా, కఠువా జిల్లాల్లో 11 మంది భద్రతా సిబ్బంది సహా 22 మంది చనిపోయారు.
BSF డీజీ, స్పెషల్ డీజీలపై కేంద్రం వేటు
Published : Aug 3, 2024, 8:15 AM IST