Amit Shah On Opposition : విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా 2029లో మళ్లీ ఎన్డీఏనే అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. ఛండీగఢ్‌లోని మణిమజ్రా నీటి సరఫరా ప్రాజెక్టును ప్రారంభించిన అమిత్ షా అనంతరం హిరంగ సభలో మాట్లాడుతూ విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొంత విజయం రాగానే మెుత్తం ఎన్నికల్లో విజయం సాధించినట్లుగా విపక్షాలు భావిస్తున్నాయని అమిత్ షా ఎద్దేవా చేశారు. దేశంలో అస్థిరతను విపక్షాలు కోరుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని, ఈ ఐదేళ్లేకాదు 2029లోనూ ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విపక్షం ఏం చేసినా అధికారంలోకి రావడం జరిగేపని కాదని వ్యాఖ్యానించారు
మళ్లీ ప్రతిపక్షంలో కూర్చోడానికి సిద్ధంగా ఉండండి- 2029లోనూ ఎన్డీఏదే విజయం: అమిత్ షా
Published : Aug 4, 2024, 4:18 PM IST