ETV Bharat / politics

మద్యం కుంభకోణం కేసుతో బీఆర్ఎస్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో నష్టపోయింది - కేటీఆర్​

మద్యం కుంభకోణం కేసుతో బీఆర్​ఎస్​ పార్టీ రాజకీయంగా నష్టపోయిందన్న కేటీఆర్​ - ఈ కేసులో కవితకు ఇవాళ న్యాయస్థానంలో న్యాయం జరిగిందని ట్వీట్ - రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్న కేటీఆర్‌

KTR Responds on Delhi Liquor Case
KTR Responds on Delhi Liquor Case (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : February 27, 2026 at 4:53 PM IST

3 Min Read
Choose ETV Bharat

KTR Responds on Delhi Liquor Case : దిల్లీ మద్యం కేసుతో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో నష్టపోయిందని, కవితకు ఇవాళ న్యాయం జరిగిందని ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మద్యం కుంభకోణం సాకుతో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చారని ఎక్స్ వేదికగా ఆక్షేపించారు. అదే తరహాలో బీఆర్ఎస్ నాయకులపై నమోదైన ప్రతి కేసు కూడా తప్పుడు, రాజకీయ ప్రేరేపిత, కల్పితమని తేలిపోతాయన్నారు. నిజం గెలవనంత వరకు కాంగ్రెస్, బీజేపీ నుంచి ఆరోపణలు వస్తూనే ఉంటాయన్నారు. దురదృష్టవశాత్తు ఈ నవభారతంలో ఈ పరిణామం కొత్త ప్రమాణంగా మారిందన్నారు. ఆరోపణలే సాక్ష్యాలు అవుతున్నాయన్నారు.అయినా చివరికి, న్యాయమే గెలుస్తుందని ఎక్స్‌లో స్పందించారు.

ఇష్టారీతిన వ్యవహరిస్తున్న కాంగ్రెస్​ నాయకలు : రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ ఆరోపించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్‌ఎస్‌ నాయకులకు హైదరాబాద్‌ తెలంగాణభవన్‌లో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో కేటీఆర్​ పాల్గొన్నారు. కేసీఆర్‌ పాలనలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దులుగా వెళ్తే నేడు అవినీతి, అరాచకం జోడెద్దులయ్యాయని విమర్శించారు. పోలీసులు, కాంగ్రెస్‌ నాయకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

బీఆర్​ఎస్​ పార్టీ గెలిచాక నిధుల వరద : ఇవాళ తెలంగాణ భవన్​లో నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్​ కాంగ్రెస్​ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఈ రెండు సంవత్సరాల్లో దోచుకోవడం, దాచుకోవడమే జరుగుతుందని, అలాగే రైతు బంధు ఇప్పటికి రైతులకు అందలేదు. అసలు కాంగ్రెస్​ పార్టీకి ఇచ్చేందుకు మొఖమే లేదని విమర్శించారు. ఇంకా ఒక్క ఏడాది ఓపికగా ఉండమని ఆ తర్వాత సంవత్సరంలో ఎన్నికలు ఉంటాయని, ఈసారి కేసీఆర్​ సర్​ ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ భవన్​లో మట్లాడారు. అలాగే మున్సిపల్​ ఎన్నికలో గెలిచిన ఛైర్మన్లు, వైస్​ఛైర్మన్లకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఓడిన వారందిరికీ ఎన్నికలో పోటీ చేసినందుకు అభినందనలు తెలిపారు. వచ్చే ఎన్నికలో బీఆర్​ఎస్ పార్టీ గెలిచిన తర్వాత రాష్ట్రంలో నిధుల వరద పారుతుందని అన్నారు.

ఈ రెండేళ్లలో దోచుకోవడం, దాచుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్​ పార్టీ బ్రహ్మండంగా అదే పనిలో ఉంది. రాష్ట్ర ప్రజలకు కూడా అన్ని అర్థమయ్యాయి. కాంగ్రెస్​ పార్టీ వల్ల మోసాలు జరుగుతున్నాయి. ఈరోజు ఫిబ్రవరి 27 ఇప్పటికి రైతు బంధు పడలేదు. మూడు సార్లు రైతు బంధు ఇవ్వాలి అన్నారు కానీ ఇప్పుడు ఒక్కదానికి ఇచ్చిందేందుకు మొఖమే కాంగ్రెస్​ పార్టీకి లేదు. ఇప్పటికి యూరియా ఇవ్వలేదు. యూరియా బస్తాలు యాప్​లో ఇస్తారంటా. యాప్​ అందరికి వాడటానికి వస్తుందా. అయినా షాపులో యూరియానే లేదు యాప్​తో యూరియా ఇస్తాడంట. యూరియా దుకాణాల ముందు లైన్లు కనబడకుండా ఉండేందుకు ఈ యాప్​లు ఇవన్నీ పెట్టారు. ఓపిక పట్టండి. ఇంకా ఒక్క సంవత్సరం ఉంది. ఆ తర్వాత మళ్లీ సంవత్సరం ఎలాగో ఎన్నికలు ఉంటాయి. మీకు నాయకులు ఉన్నారు. ఇబ్బందులు ఏమీ లేవు. తప్పకుండా ఈసారి దిమ్మతిరిగి మైండ్​ బ్లాక్​ అయ్యేటట్టు కొట్టాలి. మళ్లీ కేసీఆర్​ సర్​ ముఖ్యమంత్రి కావాలి. అలంపూర్​ ముందున్నారు. భవిష్యత్తులో నంబర్​ వన్​ నిల్చోబెట్టి బాధ్యతలు నేను, వెంకటరామ్​రెడ్డి తీసుకుంటాం. గెలిచిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. ఓడిన ప్రతి ఒక్కరికి అభినందనలు. ఛైర్మన్లు, వైస్​ఛైర్మన్లలు ఒకటే చెబుతున్నా. తొందర పడకండి. ఎన్నికలో పోటీ చేసినప్పుడు మాట ఇచ్చి ఉంటారు. అందరికి గెలిచిన కొత్తలో ఆరాటం ఉంటుంది. తొందరగా చేయాలని కానీ కాంగ్రెస్​ వాళ్లు డబ్బులు ఇవ్వరు. కొంత ఇబ్బంది పెడుతుంటారు. ఈ సంవత్సరం, సంవత్సరం పాటు వచ్చే నిధులతోనే నడుపుకోవాలి. ఆ తర్వాత బీఆర్​ఎస్​ వచ్చిన తర్వాత తప్పకుండా నిధుల వరద పారుతుంది. - కేటీఆర్​, బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు

ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడికి సిద్ధమవుతోన్న బీఆర్​ఎస్​ - పార్టీ నేతలతో సమావేశం కానున్న కేటీఆర్

ఖమ్మం శివారు వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలు - బాధితుల సమస్యలు తెలుసుకున్న కేటీఆర్