'జెన్ Z'తో ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట మంతి - ఎక్స్‌లో స్పందించిన మంత్రి లోకేశ్
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో 'జెన్ Zతో మాట మంతి' కార్యక్రమం - యువత ఆశయాలు, ఆకాంక్షలను అర్థం చేసుకుని, వారి అభిప్రాయాల ఆధారంగా ప్రయోజనకరమైన కార్యక్రమాల రూపకల్పన

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 26, 2026 at 4:57 PM IST
Gen-Z Maata Manthi Program : నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న 'జెన్ జెడ్ యువతతో మాట మంతి' కార్యక్రమంపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. జెన్-జెడ్ యువత ఆశయాలు, ఆకాంక్షలను అర్థం చేసుకుని, వారి అభిప్రాయాల ఆధారంగా ప్రయోజనకరమైన కార్యక్రమాలను రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ఆలోచనాత్మకమైన భావ వినిమయ కార్యక్రమం కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు లోకేశ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
20,000 మంది విద్యార్థులే లక్ష్యం: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తన నియోజకవర్గంలోని 'జెన్-జెడ్' విద్యార్థులు, యువతతో మమేకమయ్యేందుకు "మాట-మంతి" అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. జెన్-జెడ్ యువత ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలను తెలుసుకోవడానికి ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇందుకు ప్రధాన కారణం నారా లోకేశ్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. కోటంరెడ్డి ఆలోచనకు మెచ్చిన లోకేశ్, సామాజిక మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమంపై ఉన్న తన ఆసక్తిని వెల్లడించారు. రాబోయే 51 రోజుల్లో, నెల్లూరు రూరల్ పరిధిలోని 20,000 మంది విద్యార్థులను కలిసి వారి మాటలను వినడమే కాకుండా, వారి నుంచి ఎంతో తెలుసుకునేందుకు కోటంరెడ్డి ఆసక్తి చూపిస్తున్నారు. సరిగ్గా 40 ఏళ్ల క్రితం, సమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలనే సంకల్పంతోనే తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లు తెలిపారు.
This Gen Z platform is an excellent initiative, @kotamreddy_NLR garu. We need to keep engaging with Gen Z to understand their aspirations and plan our initiatives to benefit them. I’m looking forward to an interesting and insightful exchange of ideas. https://t.co/GNSB533PqC
— Lokesh Nara (@naralokesh) August 26, 2026
తొలి అడుగు జెనెక్స్ సంస్థతోనే: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 'జెన్ జెడ్ యువతతో మాటా మంతి' కార్యక్రమాన్ని మొదటగా స్థానిక జెనెక్స్ సంస్థతో ప్రారంభించారు. ఈ సదస్సుకు హాజరైన ప్రతి విద్యార్థితో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడి, వారి నూతన ఆలోచనలను తెలుసుకున్నారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిస్తూనే, ప్రస్తుత జెన్-జీ (జెనరేషన్ జెడ్) పిల్లల ఆలోచనా విధానంపై అవగాహన పెంచుకున్నారు. కార్యక్రమం అనంతరం అందుకు సంబంధించిన చిత్రాలను, అక్కడ తనకు ఎదురైన వినూత్న అనుభవాలను ఎమ్మెల్యే సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
— Kotamreddy Sridhar Reddy (@kotamreddy_NLR) August 25, 2026
రాజకీయ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లు, వాస్తవాలు తనను తీవ్రంగా దెబ్బతీశాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు ఉండే పరిస్థితులు ఎప్పటికీ ఒకేలా ఉండవని, ప్రయాణంలో ఎక్కడో ఒకచోట కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. నిరంతర ఒత్తిళ్లు, రాజీలు, సర్దుబాట్లు రాజకీయాల్లోకి వచ్చిన అసలు ఉద్దేశ్యాన్ని మరిచిపోయేలా చేస్తాయని, అయితే కొన్ని క్షణాలు మాత్రమే ఆ ఆశయాన్ని తిరిగి గుర్తుకు తెస్తాయని కోటంరెడ్డి స్పష్టం చేశారు.
"ఈ రోజు అలాంటి ఒక క్షణం. జెన్-జెడ్ (Gen-Z) తో సమయం గడపడం, వారి ప్రశ్నలు, ఆలోచనలు, దృక్కోణాలను వినడం నిజంగా ఉత్తేజాన్నిచ్చింది. వారి జిజ్ఞాస నా ఆలోచనా విధానాన్ని సవాలు చేసింది. అసలు నేను ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నానో నాకు గుర్తు చేసింది. చాలా కాలం తర్వాత, ఒక రాజకీయ కార్యక్రమం నుంచి నేను నిజంగా ఉత్తేజితుడనై బయటకు వచ్చాను. నేను మాట్లాడినందు వల్ల కాదు, విన్నందువల్ల. 40 ఏళ్ల క్రితం నేను రాజకీయాల్లోకి ఎందుకు ప్రవేశించానో ఈ రోజు నాకు గుర్తు చేసింది. అందుకు నేను కృతజ్ఞుడను" - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే
ఆత్మవిశ్వాసంతో ఎవరెస్ట్ అధిరోహించిన వెంకీ - అభినందించిన మంత్రి లోకేశ్
స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు పక్కా చర్యలు : మంత్రి మండిపల్లి

