ETV Bharat / politics

తాడిపత్రిలో అక్రమ మద్యం రవాణాపై సమగ్ర విచారణ జరపాలి: జేసీ ప్రభాకర్‌రెడ్డి

తాడిపత్రి గోవా మద్యం వ్యవహారంపై జగన్‌ వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి స్పందన - జగన్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్నానన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి

JC Prabhaవైఎస్ జగన్ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి kar Reddy Reaction on Jagan Comments
వైఎస్ జగన్ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 22, 2026 at 4:52 PM IST

2 Min Read
Choose ETV Bharat

JC Prabhakar Reddy Reaction on Jagan Comments : అనంతపురం జిల్లా తాడిపత్రిలో గోవా మద్యం అక్రమ రవాణా ఉదంతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. తాడిపత్రికి లారీల్లో గోవా మద్యం యథేచ్ఛగా తరలివస్తోందంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత, మున్సిపల్ మాజీ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

జగన్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తాడిపత్రికి లారీల్లో గోవా మద్యం అక్రమ రవాణా జరుగుతోందన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేసేందుకు సిద్ధమైనప్పటికీ కేసు దర్యాప్తులో ఉందని, త్వరలోనే నిందితులను బయటపెడతామని పోలీసులు హామీ ఇవ్వడంతో నిరసనను విరమించుకున్నట్లు తెలిపారు.

వైఎస్ జగన్ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి (ETV Bharat)

"జగన్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్నా. తాడిపత్రికి గోవా మద్యం అక్రమ రవాణాపై సమగ్ర విచారణ జరపాలి. అక్రమ మద్యం కేసుపై పీఎస్‌ ఎదుట ధర్నాకు సిద్ధమయ్యాం. త్వరలోనే నిందితులను బయటపెడతామని పోలీసులు హామీ ఇచ్చారు. దర్యాప్తులో ఉన్నప్పుడు పోలీసులను ఇబ్బంది పెట్టకూడదని నిరసన విరమించా. కొన్నిరోజుల్లో సమగ్ర విచారణ పూర్తిచేసి నిందితులను బహిర్గతం చేయాలి. నిందితుల వివరాలు వెల్లడించకపోతే మళ్లీ నిరసనకు దిగుతా" - జేసీ ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ నేత

మరోవైపు తాడిపత్రి పట్టణ సీఐ ఆరోహణరావు ఆధ్వర్యంలో పోలీసులు నిరంతరం నిఘా ఉంచి ఈ అక్రమ రవాణా గుట్టురట్టు చేశారు. తాడిపత్రి రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒక లారీని పోలీసులు అడ్డుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో లారీ క్యాబిన్ వెనుక భాగంలో, కింది వైపు అత్యంత చాకచక్యంగా రహస్యంగా ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక బాక్స్‌ను పోలీసులు గుర్తించారు. ఆ బాక్స్‌ను తెరిచి చూడగా భారీగా గోవా మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి.

పోలీసులు ఈ తనిఖీల్లో దాదాపు 400 విదేశీ గోవా మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, పోలీసుల కళ్లు గప్పేందుకు సదరు లారీకి రెండు వేర్వేరు నంబర్ ప్లేట్లు ఉన్నట్లు గుర్తించారు. లారీకి ఒకవైపు కర్ణాటక రాష్ట్రానికి చెందిన నంబర్ ప్లేట్ ఉండగా, మరొకవైపు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ అమర్చి ఉంది. ప్రస్తుతం లారీతో పాటు భారీ విలువైన మద్యం నిల్వలను పోలీసులు సీజ్ చేశారు. అక్రమ మద్యం రవాణా వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

పెద్దారెడ్డి ఇంటికి వెళ్లేందుకు జేసీ ప్రభాకర్​ రెడ్డి యత్నం - తాడిపత్రిలో టెన్షన్​

'కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్రమాలపై చర్యలు తీసుకోండి' - కలెక్టర్‌కు జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు