మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌తో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ భేటీ - పలు అంశాలపై చర్చ
మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ భేటీ - రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై సమాలోచనలు - ఏపీకి రెండు ఆడ పులులు ఇస్తున్నందుకు పవన్ కృతజ్ఞతలు -

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 30, 2026 at 12:21 PM IST
Pawan Kalyan Meeting with Maharashtra CM : మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌తో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ భేటీ అయ్యారు. సోమవారం వైద్య పరీక్ష నిమిత్తం ముంబయి వెళ్లిన పవన్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఫడణవీస్‌ను కలిశారు. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ముంబయిలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.
తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి రెండు ఆడ పులులు ఇచ్చే అంశాలపై ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని నిర్ణయించారు. తూర్పు కనుమల ప్రాంతంలో ఆడ పులుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తాయని ఈ క్రమంలో పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నట్లు పవన్ తెలిపారు.
Had a warm and productive meeting with the Hon'ble Chief Minister of Maharashtra, Shri @Dev_Fadnavis Ji. We discussed a range of issues of mutual interest and explored opportunities for greater cooperation between our two States.
— Pawan Kalyan (@PawanKalyan) June 30, 2026
I conveyed my sincere thanks to him for… pic.twitter.com/k6Vc4GADUd
ఏపీకి రెండు ఆడ పులులు: రాష్ట్రానికి రెండు ఆడ పులులు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని ఈ సహకారానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పవన్ చెప్పారు. తూర్పు కనుమలలో పులుల సంరక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ఆడ పులుల ప్రవేశంతో అంతరసంతానోత్పత్తి సమస్యలను అధిగమించడంతోపాటు జన్యు వైవిధ్యం పెరిగి, పులుల సంఖ్య దీర్ఘకాలిక స్థిరత్వానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ - మహారాష్ట్ర మధ్య ఏర్పడిన ఈ భాగస్వామ్యం తూర్పు కనుమలలో పులుల దీర్ఘకాలిక సంరక్షణకు విశేషంగా దోహదపడుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నిరంతరం మార్గదర్శకత్వం అందిస్తున్న కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వన్యప్రాణి, జీవ వైవిధ్య పరిరక్షణ లక్ష్యాల సాధనలో మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వామ్య సంస్థలతో కలిసి మరింత సమన్వయంతో ముందుకు వెళ్తామన్నారు.
రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయడం: రాష్ట్రంలో తూర్పు కనుమలలో పులుల సంఖ్యను పెంచేందుకు, జన్యు వైవిధ్యాన్ని పెంపొందించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం రెండు ఆడపులులను ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ గొప్ప సహాయానికిగానూ పవన్ కల్యాణ్ మహారాష్ట్ర సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం సైన్స్ ఆధారిత, స్థిరమైన పద్ధతులతో రెండు రాష్ట్రాలు కలిసి పని చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ చొరవకు మార్గదర్శకత్వం వహించిన కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసే వారికే పదవులు: పవన్ కల్యాణ్
కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ తొలి స్నాతకోత్సవం - ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము

