వైభవంగా ముగిసిన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు
Yadadri Brahmotsavalu 2026 :యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు అర్చకులు పరిసమాప్తి పలికారు. ఆలయంలో 108 కలశాలను వరుసగా పేర్చి వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య, మంగళ వాయిద్యాల హోరు నడుమ కలశాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 108 కలశాల్లో ఉన్న జలంతో స్వామివారికి అర్చనాభిషేకాలు నిర్వహించి స్వామిఅమ్మవార్లను గర్భాలయంలోకి తీసుకెళ్లారు. అంతకుముందు దాదాపు 2 గంటల పాటు హోమంను శాస్త్రోత్తంగా నిర్వహించారు.
(ETV)

Published : March 1, 2026 at 7:49 AM IST

