యాదాద్రి అనుబంధ ఆలయంలో ఘనంగా ప్రారంభమైన శరన్నవరాత్రులు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవాలయం అనుబంధ ఆలయమైన పర్వతవర్థిని సమేత రామలింగేశ్వర స్వామి మందిరంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి విఘ్నేశ్వర పూజ, స్వస్తి వాచనము పంచగవ్యప్రాశన, అఖండ దీపారాధన, అంకురారోపణము, మండపారాధన మొదలైన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
(ETV Bharat)

Published : October 11, 2026 at 6:20 PM IST

