సీఎస్‌గా సాయిప్రసాద్ బాధ్యతల స్వీకరణ
New CS Sai Prasad: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్ శనివారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన కార్యాలయంలో టీటీడీ, దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం వేదపండితుల ఆశీర్వచనాల మధ్య, ప్రత్యేక పూజల అనంతరం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ సీఎస్‌గా సేవలందించిన విజయానంద్ పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో సాయిప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రతినిధులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
(ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 1, 2026 at 9:03 AM IST

