ETV Bharat / photos

యాదాద్రిలో పదోరోజున అంగరంగ వైభవంగా పూర్ణాహుతి - చక్ర తీర్థం నిర్వహణ

yadagirigutta brahmotsavam 2026
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. పదోరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూర్ణాహుతి, చక్ర తీర్థం నిర్వహించారు. అర్చకులు లక్ష్మీ సమేత నరసింహుడిని ఆలయ నుంచి కొండపైన విష్ణు పుష్కరిణి వరకు ప్రత్యేక పల్లకిపై తీసుకెళ్లి పూజలు నిర్వహించారు. పూజల అనంతరం విష్ణు పుష్కరిణిలో చక్రస్నాన ఘట్టం అర్చకులు శాస్రోక్తంగా నిర్వహించారు. నేడు అష్టోత్తర శత ఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : February 28, 2026 at 3:19 PM IST

1 Min Read
Choose ETV Bharat