రాష్ట్రంలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు - అమ్మవారికి ప్రత్యేక పూజలు
శ్రావణ మాసం సందర్భంగా రాష్ట్రాంలోని వివిధ ప్రాంతాల్లో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాస విశిష్టతను గుర్తుచేసుకుంటూ ఈ మాసంలో పాటించే సంప్రదాయాలు, ఆచారాలను మహిళలు తోటివారితో పంచుకున్నారు. సంప్రదాయబద్ధంగా అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలతో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. అనంతరం ముత్తయిదువులకు వాయినాలు అందజేశారు.
(ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 21, 2026 at 8:38 PM IST

