సంక్రాంతికి పల్లెబాట పట్టిన నగరవాసులు - కిక్కిరిసిన రహదారులు
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపునకు వెళ్లే రహదారులన్నీ సంక్రాంతికే అన్నట్లుగా మారాయి. నగరం నుంచి పల్లెలకు పయనమవుతున్న వాహనాలతో రోడ్లన్నీ కిక్కిరిశాయి. ప్రధానంగా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి 65, సూర్యాపేట - ఖమ్మం 365 బీబీ, నార్కట్పల్లి వయా నల్గొండ, మిర్యాలగూడ మీదుగా అద్దంకి, గుంటూరు వైపునకు ప్రయాణించే వారితో రద్దీగా దర్శనమిస్తున్నాయి.
(Eenadu)

Published : January 11, 2026 at 2:39 PM IST

