రాష్ట్రవ్యాప్తంగా హోలీ సంబరాలు - వాడవాడలా సందడే సందడి
రాష్ట్రవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నా, పెద్దా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి యువత డీజే పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ.. కేరింతలు కొడుతూ వేడుకలు చేసుకున్నారు. హోలీ పర్వదినంతో వీధులన్నీ రంగులమయంగా మారి సందడి వాతావరణం నెలకొంది. రంగుల కేళి హోలీ వేడుకల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హ్యాపీ హోలీ అంటూ కేరింతలు కొట్టారు.
(ETV Bharat)

Published : March 3, 2026 at 2:15 PM IST

