యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ - దర్శనం కోసం భారీ క్యూలైన్లు
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు సెలవు కారణంగా స్వామి వారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులుతీరారు. ఆలయంలో నిర్వహించిన కల్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో సర్వదర్శనానికి దాదాపు 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి ఒక గంట సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ప్రసాద విక్రయ శాల వద్ద సందడి నెలకొంది.
(ETV Bharat)

Published : October 2, 2026 at 2:21 PM IST

