తెలుగు భాషాదినోత్సవ వేడుకల్లో సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల
మనసులోని భావాలను అత్యంత సహజంగా, లోతుగా వ్యక్తీకరించగల శక్తి మాతృభాషకే ఉందని ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. తెలుగు భాషలోని మాధుర్యం, భావోద్వేగం, సాహిత్య గొప్పతనాన్ని నేటి తరానికి చేరువ చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మెహదీపట్నంలోని సెయింట్ ఆన్స్ మహిళా కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో శనివారం తెలుగు భాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
(sekhar kammula on Telugu Language)

Published : August 31, 2026 at 11:02 PM IST

