ETV Bharat / opinion

సైబర్ సెక్యూరిటీ డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్ - ఎవిడెన్స్‌ ఎలా కనిపెడతారంటే?

వీఆర్ సిద్ధార్థ యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ - నేర విచారణలో ఆధారాల సేకరణకు కీలకంగా ల్యాబ్ - మొబైల్ నుంచి డేటా రికవరీకి టెక్నాలజీ వినియోగం- డిజిటల్ ఫోరెన్సిక్‌ అనాలసిస్‌పైనా ప్రత్యేక దృష్టి

Digital Forensic Lab Launched at VR Siddhartha University
Digital Forensic Lab Launched at VR Siddhartha University (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 21, 2026 at 10:54 AM IST

|

Updated : February 21, 2026 at 12:56 PM IST

3 Min Read
Choose ETV Bharat

Digital Forensic Lab Launched at VR Siddhartha University : ఓ నేరం జరిగినప్పుడు ఆధారాలు సేకరించడం అనేది చాలా కీలకం. ఈ ఎవిడెన్స్‌తోనే నిందితులు ఎవరు అనేది కనిపెట్టవచ్చు. డిజిటల్ ఫోరెన్సిక్‌ ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తోంది. క్రైమ్‌ సీన్‌లో దొరికే ఎలక్ట్రానిక్‌ పరికరాల నుంచి అత్యంత కీలకమైన డేటాను సేకరించేందుకు ఉపయోగపడుతోంది. ఈ క్రమంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే పరికరాలతో విజయవాడ వీఆర్ సిద్ధార్ధ యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీ డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. బాధితులకు, పోలీసులకు డిజిటల్ ఆధారాల సేకరణలో ఈ ల్యాబ్ ద్వారా తమ వంతు సాయం అందించనున్నారు. మరి ఈ టెక్నాలజీ ఎలా పని చేస్తుంది? డేటాను ఎలా సేకరిస్తారు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

డిజిటల్ క్రైమ్స్‌లో ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌ డిస్క్‌లు కీలకంగా ఉంటాయి. వాటిలో ఉన్న సమాచారాన్ని రిట్రీవ్ చేయడం చేయడం కూడా ముఖ్యమే. వీఆర్ సిద్ధార్ధ యూనివర్సిటీలో ఇందుకు సంబంధించి ప్రత్యేక సాఫ్ట్‌వేర్ వినియోగిస్తున్నారు. దీని ద్వారా ముఖ్యమైన వివరాలను తెలుసుకునేందుకు వీలవుతోంది. డిజిటల్ ఆధారాలు ట్యాంపర్‌కు గురి కాకుండా చూసుకోవచ్చు. మరి ఈ వ్యవస్థ ఎలా పని చేస్తుంది? ఏ పరికరాలు ఇందుకోసం ఉపయోగిస్తున్నారు అనే వివరాలు ల్యాబ్ సిబ్బంది మాటల్లోనే తెలుసుకుందాం.

సైబర్ సెక్యూరిటీ డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్ - ఎవిడెన్స్‌ ఎలా కనిపెడతారంటే? (ETV)

ఏడాది క్రితం డేటాను కూడా సేకరించవచ్చు: సైబర్​ సెక్యూరిటీ మొబైల్​ ఫోరెన్సిక్​తో పాటు 3 విభాగాలు ఉంటాయి. మొబైల్ నుంచి డేటా రికవరీకి టెక్నాలజీ వినియోగిస్తున్నారు. డిజిటల్ ఫోరెన్సిక్‌ అనాలసిస్‌ పైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మొబైల్ ఐసోలేట్ చేసి డేటా రిట్రీవ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. కాల్ రికార్డ్స్ నుంచి వివరాలు అన్నీ తెలుసుకోవచ్చు. డేటా సేకరించడానికి ప్రత్యేక కనెక్టర్ల వినియోగం కూడా ఉంది. వర్క్‌ స్టేషన్ ద్వారా ఫోన్లలోని ఆధారాల సేకరణ జరుగుతోంది. సిమ్‌ కార్డులను క్లోన్ చేసేందుకు ప్రత్యేక పరికరం వినియోగిస్తున్నారు. ఎమ్‌సాబ్ సాఫ్ట్‌వేర్ ద్వారా డేటా రిట్రీవ్‌కు అవకాశం ఉంది. ఏడాది క్రితం డేటాను కూడా సేకరించవచ్చు.

సైబర్ భద్రత కల్పించే విధంగా వీఆర్ సిద్ధార్ధ యూనివర్సిటీలో ప్రత్యేకంగా సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఎలాంటి సైబర్ దాడి జరగనుంది? వాటిని ఎలా అడ్డుకోవాలి అనే వివరాలు ఇక్కడ తెలుసుకునేందుకు వీలుంటుంది. ఈ కేంద్రం ద్వారా సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌తో పాటు అలెర్ట్ మేనేజ్‌మెంట్‌ చేయొచ్చని చెబుతున్నారు ఇక్కడి సిబ్బంది. ఈ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ పని తీరుని వివరించారు.

కోర్టులో సబ్మిట్ చేసే విధంగా రిపోర్ట్ తయారీ: డిజిటల్ నేరాల్లో ఎవిడెన్స్‌ సేకరణలో సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఆధారాలు ట్యాంపర్‌ అయ్యే అవకాశం ఉండదు. రైట్ బ్లాకర్ పరికరం ద్వారా ఆధారాల సేకరిస్తున్నారు. హార్డ్‌ డిస్క్ లేదా పెన్‌డ్రైవ్‌ నుంచి ఇమేజింగ్ ఇన్‌పుట్ ఇస్తే ఔట్‌పుట్ ఇచ్చేలా పరికరం పని చేస్తోంది. లాజికల్‌గా డేటాను సేకరించే వెసులుబాటు ఉంది. హాష్ వాల్యూ ఆధారంగా ఆధారాల విశ్లేషణ జరుగుతోంది. డిలీట్ చేసిన ఆధారాలనూ గుర్తించవచ్చు. అటాప్సీ టూల్‌ ద్వారా ఆధారాలు అనలైజ్ చేయవచ్చు. కోర్టులో సబ్మిట్ చేసే విధంగా రిపోర్ట్ తయారీ చేస్తున్నారు.

ఏ దేశంపై సైబర్ అటాక్ జరుగుతోందో తెలుసుకోవచ్చు. ప్రపంచవ్యాప్త సైబర్ దాడులను గుర్తించే వీలు ఉంటుంది. ఈ సెంటర్ ద్వారా అనుక్షణం టెక్ మానిటరింగ్ జరుగుతోంది. చిన్న తరహా పరిశ్రమలకు ఎంతో ఉపయోగం. సర్వర్స్‌పై దాడులను మానిటర్ చేయవచ్చు. ఎప్పటికప్పుడు దాడుల తీవ్రతను తగ్గించవచ్చు. సైబర్ బాధితులకు అండగా నిలిచేలా చర్యలు తీసుకుంటున్నారు. సైబర్ సెక్యూరిటీ కోర్సులతో మంచి భవిష్యత్ ఉంది. సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్‌కు మార్కెట్‌లో డిమాండ్.

ఏఐతో మెరుగుపడనున్న జీవన ప్రమాణాలు - 15-20 ఏళ్లలో ఉచిత సేవలు!

గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ నోట 'సబ్‌ సీ కేబుళ్ల' మాట - ఇదేంటో మీకు తెలుసా?

Last Updated : February 21, 2026 at 12:56 PM IST