ETV Bharat / offbeat

యాదాద్రి, చిలుకూరు బాలాజీ, రామోజీ ఫిలింసిటీ సందర్శన - IRCTC టూర్ ప్యాకేజీ!

"యాదాద్రి, చిలుకూరు బాలాజీ దర్శన్ విత్ రామోజీ" - నాలుగు రోజుల యాత్ర

irctc_yatra
irctc_yatra (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 27, 2026 at 3:06 PM IST

2 Min Read
Choose ETV Bharat

IRCTC Yatra : ఆథ్యాత్మికంగా పర్యటనలో ఆలయాలను దర్శించుకుని, ఆపై చారిత్రక కట్టడాలను సందర్శిస్తే ఎలా ఉంటుంది?! ముందుగా భాగ్యనగరాన్ని​ చుట్టేయడంతో పాటు ఆ తర్వాత చిలుకూరు బాలాజీ టెంపుల్, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని చివరగా రామోజీ ఫిలింసిటీలో విహరిస్తే? అవును! ఐఆర్​సీటీసీ ఈ ప్యాకేజీని ఆఫర్ చేస్తోంది. మూడు రాత్రులు, నాలుగు పగళ్లు విహరించేలా "యాదాద్రి, చిలుకూరు బాలాజీ దర్శన్ విత్ రామోజీ" అనే పేరుతో సరికొత్త ప్లాన్ రూపొందించింది. ఆ వివరాలేమిటో చూద్దామా!

ఛలో "చార్​ధామ్" - ఏ ఆలయం ఎప్పుడు తెరుచుకుంటుందో తెలుసా? తేదీలు వచ్చేశాయి!

యాత్రలో భాగంగా తొలిరోజు హైదరాబాద్​, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో పికప్ చేసుకుని హోటల్​కి తీసుకెళ్తారు.

  • ముందుగా చార్మినార్, చౌమహల్ ప్యాలెస్, సాలార్జంగ్ మ్యూజియం, బిర్లా మందిర్, లుంబిని పార్క్ చూపించి హోటల్​కు తీసుకువస్తారు. రాత్రి హైదరాబాద్​లోనే బస చేయాల్సి ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం అల్పాహారం చేశాక ముందుగా చిలుకూరు బాలాజీ ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత లోటస్ టెంపుల్, ఎకో పార్క్ చూశాక తిరిగి హోటల్​ వద్దకు తీసుకువస్తారు.
  • మూడో రోజు ఉద్యం బ్రేక్​ఫాస్ట్ చేశాక యాదగిరిగుట్టకు బయల్దేరుతారు. లక్ష్మీనరసింహ స్వామి దర్శనం తర్వాత సురేంద్రపురి, స్వర్ణగిరి దర్శనం ఉంటుంది. రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
  • యాత్రలో చివరిదైన నాలుగో రోజున అల్పాహారం చేశాక రామోజీ ఫిలింసిటీని సందర్శిస్తారు. రోజంతా ఫిలింసిటీలో విహరించిన తర్వాత సాయంత్రానికి హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో డ్రాప్ చేస్తారు.

ప్యాకేజీ ధరలు

  • 1 నుంచి ముగ్గురు ప్రయాణికులకు డబల్ షేరింగ్ స్టాండర్డ్ రూ.17,430, కంఫర్ట్ రూ.20,590.
  • 1 నుంచి ముగ్గురు ప్రయాణికులకు త్రిపుల్ షేరింగ్ స్టాండర్డ్ రూ.12,860, కంఫర్ట్ రూ.15,830.
  • 1 నుంచి ముగ్గురు గ్రూపులో 5నుంచి 11ఏళ్ల లోపు వయస్సున్న పిల్లలకు విత్ బెడ్ డబల్ షేరింగ్ స్టాండర్డ్ రూ.8,080, కంఫర్ట్ రూ.10,670.
  • 1 నుంచి ముగ్గురు గ్రూపులో 5నుంచి 11ఏళ్ల లోపు వయస్సున్న పిల్లలకు విత్ బెడ్ త్రిపుల్ షేరింగ్ స్టాండర్డ్ రూ.6,220, కంఫర్ట్ రూ.8,080.
  • 4 నుంచి 6 : ప్రయాణికులకు డబల్ షేరింగ్ స్టాండర్డ్ రూ.12,700, కంఫర్ట్ రూ.15,850.
  • 4 నుంచి 6 : ప్రయాణికులకు త్రిపుల్ షేరింగ్ స్టాండర్డ్ రూ.10,460, కంఫర్ట్ రూ.13,430.
  • 4 నుంచి 6 : గ్రూపులో 5నుంచి 11ఏళ్ల లోపు వయస్సున్న పిల్లలకు డబల్ షేరింగ్ విత్ బెడ్ స్టాండర్డ్ రూ.7,870, కంఫర్ట్ రూ.10,470.
  • 4 నుంచి 6 : ముగ్గురు గ్రూపులో 5నుంచి 11ఏళ్ల లోపు వయస్సున్న పిల్లలకు విత్ బెడ్ త్రిపుల్ షేరింగ్ స్టాండర్డ్ రూ.6,010, కంఫర్ట్ రూ.7,870.

యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలకు విజయవాడ రైల్వేస్టేషన్​ పరిధిలోని ప్రయాణికులు 8287932312, తిరుపతి రైల్వేస్టేషన్​ పరిధిలోని ప్రయాణికులు 8287932317 నంబర్లలో సంప్రదించవచ్చు.

ట్రెయిన్ రిజర్వేషన్ టికెట్ వేరొకరికి బదిలీ చేసుకోవచ్చు - ఎలా సాధ్యమంటే!

ఏటీఎం కార్డుపై రూ.20లక్షలు! - ఉచితంగా బీమా​ ఉందని మీకు తెలుసా?