ETV Bharat / offbeat

నలుగురిలో ఉంటే కాసేపటికే చిరాకుగా అనిపిస్తోందా? - ఈ మానసిక సమస్యే కారణం!

మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? - అది సోషల్‌ బర్నవుట్​కు సంకేతం అంటున్న నిపుణులు!

What is Social Fatigue
What is Social Fatigue (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 21, 2026 at 4:32 PM IST

3 Min Read
Choose ETV Bharat

What is Social Fatigue : కొందరు నలుగురిలోకి వెళ్లినప్పుడు అందరితో పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఎంతసేపైనా సరదాగా గడిపేస్తుంటారు. కానీ, మరికొందరు మాత్రం కాసేపటికే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లిపోదామా అని ఆలోచిస్తుంటారు. మీరూ నలుగురిలోకి వెళ్లినప్పుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారా? అయితే, అది సోషల్‌ బర్నవుట్‌ కావొచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ, దీన్ని ఎలా గుర్తించాలి? ఈ మానసిక స్థితి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సామాజిక వేడుకల్లో, కార్యక్రమాల్లో పాల్గొన్న కాసేపటికి లేదంటే ఎక్కువ సమయం గడిచే కొద్దీ అక్కడ నుంచి దూరంగా వెళ్లిపోవాలనిపించడం, ఒంటరిగా గడపాలని అనిపించడాన్ని "సోషల్‌ బర్నవుట్‌" లేదా "Social Fatigue"గా పేర్కొంటున్నారు నిపుణులు. మనసుపై ప్రతికూల ప్రభావం చూపే ఈ పరిస్థితిని నేటి రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. అయితే, కొన్ని లక్షణాలతో దీన్ని సింపుల్​గా కనిపెట్టవచ్చంటున్నారు.

దీన్ని ఎలా గుర్తించవచ్చంటే?

  • నార్మల్​గా నలుగురిలో ఉన్నప్పుడు ఒత్తిడి దూరమై ప్రశాంతత చేకూరుతుంది. అయితే కొంతమంది మాత్రం కొద్దిసేపు బృందంలో ఉన్నా, మాట్లాడినా అలసిపోతుంటారు. దాంతో ఇక మా వల్ల కాదంటూ ఇంటికి వెళ్లిపోవాలని, వాళ్లందరికీ దూరంగా ఉండాలని కోరుకుంటారు.
  • ఈ టైమ్​లో ఫోన్‌ కాల్స్‌ వచ్చినా కట్‌ చేస్తుంటారు. మెసేజ్​లు వచ్చినా రిప్లై ఇవ్వరు. ఇలా ఒక రకమైన చిరాకును వాళ్లలో గమనించవచ్చంటున్నారు.
  • నలుగురి మధ్యలో ఉన్నా ముభావంగా కూర్చుండిపోతారు. వాళ్లతో మాట కలపడానికి ఇంట్రెస్ట్ చూపకపోవడం, వాళ్లు వేసిన జోక్స్‌కి నవ్వకపోవడం, ఏదో ఆలోచనలో ఉండిపోవడం ఇవన్నీ సోషల్‌ బర్నవుట్‌కు సూచనలే అంటున్నారు నిపుణులు.
  • ఏకాగ్రత లోపించి అవతలి వాళ్లు అడిగే క్వశ్చన్స్​కు ఏవేవో పొంతన లేని ఆన్సర్స్​ చెప్పడం, తడబడడం వీళ్లలో కనిపిస్తుందని చెబుతున్నారు.
  • ఒక్కోసారి ఓపిక కోల్పోయి ఎదుటివారిపై చిరాకు పడడం, కోపంగా మాట్లాడడం వంటివి కూడా కనిపిస్తాయంటున్నారు.
  • కొంతమందిలో ఈ 'సోషల్‌ బర్నవుట్‌' వల్ల తలనొప్పి, అలసట, కండరాల నొప్పులు వంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయంటున్నారు నిపుణులు.

రాత్రిపూట ఈ 'పొరపాట్లు' చేస్తున్నారా? - విడాకులకు కారణం కావొచ్చు జాగ్రత్త!

సోషల్‌ బర్నవుట్‌ నుంచి ఎలా బయటపడాలంటే?

  • సోషల్ బర్నవుట్ నుంచి బయటపడి తిరిగి మానసిక ప్రశాంతతను పొందడానికి కొన్ని మార్గాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
  • కొన్నిసార్లు అవతలివారు ఏమనుకుంటారోనని నచ్చకపోయినా, అందరితో కలిసిపోవడానికి ట్రై చేస్తుంటారు కొంతమంది. కానీ ఇలా మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం మంచిది కాదంటున్నారు. కాబట్టి నిర్మొహమాటంగా ఆ వేడుక నుంచి బయటికొచ్చేయడం బెటర్ అని చెబుతున్నారు.
  • నలుగురిలో ఎక్కువ టైమ్ ఉండలేననుకున్నప్పుడు ఇలాంటి సామాజిక కార్యక్రమాలు/వేడుకలకు వెళ్లినప్పుడు నిర్దేశిత సమయం అంటూ పెట్టుకోవాలి. అంతకుమించి ఒక్క క్షణం కూడా అక్కడ ఆగకుండా వెనక్కి వచ్చేయాలి. అలాగే ఈ విషయాన్ని ముందుగానే మీ బృంద/కుటుంబ సభ్యులకు తెలియజేయాలి. ఫలితంగా మీరు బర్నవుట్‌ అయ్యే ఛాన్స్ ఉండదంటున్నారు నిపుణులు.
  • సోషల్‌ బర్నవుట్‌తో అలసిన మనసు తిరిగి పునరుత్తేజితం అయ్యేవరకు గ్రూప్‌ చాట్స్‌, సందేశాలకు దూరంగా ఉండడం బెటర్ అంటున్నారు.
  • మీ మనసును ఉత్తేజితం చేసే, మనసుకు నచ్చిన పనులు చేయాలి. వాటిని ఒంటరిగానైనా చేయచ్చు. లేదంటే ఇంట్లో వాళ్లతో కలిసైనా సరదాగా చేసేయచ్చని చెబుతున్నారు.
  • యోగా, ధ్యానం, మ్యూజిక్ వినడం వంటివి మానసిక అలసటను దూరం చేసి తిరిగి పునరుత్తేజితం చేస్తాయంటున్నారు.
  • కొందరు 'పిలిచిన ప్రతి ఈవెంట్‌కీ వెళ్లాలి, నలుగురి దృష్టిలో పడాలి' అనుకుంటారు. అయితే కొన్నిసార్లు ఇలా ఇతరుల్ని సంతృప్తిపరచాలన్న ఆతృత కూడా బర్నవుట్‌ అయ్యేలా చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే వాళ్లు పిలిచారు కదా, తప్పకుండా వెళ్లాలి అనుకోకుండా, మీ మనసు మాట వినాలి అంటున్నారు. అప్పుడే మానసికంగా అలసిపోకుండా జాగ్రత్తపడవచ్చని చెబుతున్నారు.
  • అలాగని సమాజానికి దూరంగా ఉండడం కూడా సరికాదంటున్నారు. కాబట్టి, సామాజిక సంబంధాల్ని కొనసాగించే విషయంలో, మీకోసం మీరు కేటాయించుకునే టైమ్ పరంగా కొన్ని పరిమితులు పెట్టుకోవడం వల్ల ఇటు మీరు బర్నవుట్‌కి గురికాకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే నలుగురితో సత్సంబంధాల్నీ కొనసాగించవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.

కెరీర్​ను పరుగులు పెట్టించాలంటే - '7-38-55' రూల్ గురించి తెలుసుకోవాల్సిందే!

'మొబైల్' వర్షంలో తడిసిందా? - నిపుణులు సూచిస్తున్న సింపుల్ టిప్స్ మీ కోసం!