ETV Bharat / offbeat

ఉల్లి ఆకుతో పసందైన "ఎగ్​ కర్రీ" - అన్నం, చపాతీల్లోకి అద్భుతమైన కాంబో!

స్ప్రింగ్ ఆనియన్స్, కోడిగుడ్డుతో నోరూరించే కర్రీ - ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

Sping Onion Egg Curry
Sping Onion Egg Curry (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 23, 2026 at 12:21 PM IST

2 Min Read
Choose ETV Bharat

Ulli Aku Egg Curry Recipe : సాధారణంగా ఇంట్లో వెజిటేబుల్స్ లేకపోతే అప్పటికప్పుడు ఎగ్స్​తో ఏదో ఒక కూర చేయడం చాలా మందికి అలవాటు. అలాగే వీటితో చేసిన రెసిపీలను పిల్లలు, పెద్దలూ ఇష్టంగా తింటారు! అయితే ఈసారి కొత్తగా ఉల్లి ఆకు కాంబినేషన్​లో ఎగ్ కర్రీ చేశారంటే సరికొత్త రుచితో భలే కమ్మగా ఉంటుంది. ఇది అన్నం, రోటీ, పులావ్, చపాతీ​ ఇలా అన్నింటిల్లోకి సూపర్ కాంబినేషన్. రెగ్యులర్​గా ఒకే రుచిలో కూరలు తిని బోర్ కొట్టిన వారికి ఇది మంచి ఆప్షన్ కూడా! అలాగే దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్. మరి ఈ టేస్టీటేస్టీ ఉల్లి ఆకు కోడిగుడ్డు కూరను ఎలా రెడీ చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఘుమఘుమలాడే "మెంతికూర పచ్చడి" - కమ్మగా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది!

Sping Onion Egg Curry
ఉల్లి ఆకు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • ఉల్లి ఆకులు - 6
  • ఆయిల్ - 1 టేబుల్ స్పూన్
  • ఉల్లిపాయ - 1
  • కరివేపాకు - కొద్దిగా
  • పచ్చిమిర్చి - 6
  • టమోటా - 1
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - అర స్పూన్
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - అర స్పూన్
  • కారం - 2 టేబుల్ స్పూన్లు
  • కోడిగుడ్లు - 2
  • ధనియాల పొడి - అర స్పూన్
  • గరం మసాలా - అర స్పూన్
  • కొత్తిమీర - కొద్దిగా
Sping Onion Egg Curry
కోడిగుడ్లు (Getty Images)

తయారీ విధానం :

  • ముందుగా ఆరు ఉల్లి ఆకులను(స్ప్రింగ్ ఆనియన్స్​) చివరన కట్ చేసుకోవాలి. ఆ తర్వాత చిన్నచిన్న ముక్కలుగా తరిగి శుభ్రంగా కడిగి పక్కనుంచాలి. అదేవిధంగా ఒక ఉల్లిపాయ, ఆరు పచ్చిమిర్చి, ఒక టమోటాను ముక్కలుగా కట్ చేయాలి.
  • ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా ముక్కలు, కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించాలి.
Sping Onion Egg Curry
ఉల్లిపాయ ముక్కలు (Getty Images)
  • ఈ మిశ్రమం మగ్గాక ఇందులో అర స్పూన్ పసుపు, అర స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మూతపెట్టి మగ్గించాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ఆకులు వేసి మూతపెట్టాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి మధ్యమధ్యలో కలుపుతూ మూడు నిమిషాల పాటు ఉడికించాలి.
  • 3 నిమిషాల అనంతరం రెండు టేబుల్ స్పూన్ల కారం వేసి మిక్స్ చేయాలి. అలాగే రెండు కోడిగుడ్లను పగలగొట్టి వేయాలి. ఆ తర్వాత మంటను లో ఫ్లేమ్​లో ఉంచి మూతపెట్టి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
Sping Onion Egg Curry
పచ్చిమిర్చి (Getty Images)
  • రెండు నిమిషాల తర్వాత అర స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ గరం మసాలా పొడి వేసి మూతపెట్టాలి. అనంతరం మంటను లో ఫ్లేమ్​లో ఉంచి మధ్యమధ్యలో కలపాలి.
  • ఈ మిశ్రమం చక్కగా ఉడికాక చివరన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
Sping Onion Egg Curry
అల్లంవెల్లుల్లి పేస్ట్ (Getty Images)
  • అంతే ఘుమఘుమలాడే ఉల్లి ఆకు ఎగ్ కర్రీ రెడీ అయినట్లే!
  • మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ఓసారి ట్రై చేయండి.

"పాలకూర పచ్చి బఠానీ కర్రీ" - ఇదొక్కటి చాలు పూరీ, రైస్​లో పర్ఫెక్ట్​గా ఉంటుంది!

నోరూరించే "వెల్లుల్లి మిరియాల రసం" - కమ్మగా గొంతులోకి దింగుతుంటే ఆహా అనాల్సిందే!