ETV Bharat / offbeat

వెడ్డింగ్​ స్టైల్​ "బెండకాయ ఫ్రై" - కరకరలాడుతూ సూపర్​గా ఉంటుంది!

-బెండకాయ ఫ్రైను రొటీన్​ పద్ధతిలో చేస్తున్నారా? - ఓసారి ఇలా ట్రై చేయండి!

Wedding Style Bendakaya Fry
Wedding Style Bendakaya Fry (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : February 27, 2026 at 6:01 PM IST

3 Min Read
Choose ETV Bharat

Wedding Style Bendakaya Fry: చిన్న పిల్లలు ఇష్టంగా తినే కూరగాయల్లో బెండకాయ ఒకటి. జిగురు ఉన్నా సరే ఫ్రై చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు. అయితే బెండకాయతో ఎన్ని వెరైటీలు చేసినా వెడ్డింగ్​ స్టైల్లో చేసే రెసిపీకి సెపరేట్​ ఫ్యాన్స్​ ఉంటారు. కరకరలాడుతూ స్పైసీగా ఉండే దీనిని నేరుగా తినొచ్చు కూడా. పైగా సాంబార్​, పెరుగన్నంలోకి సైడ్​డిష్​గా పర్ఫెక్ట్​. అందుకే చాలా మంది అదే స్టైల్లో ఇంట్లో ట్రై చేస్తుంటారు. కానీ అంత పర్ఫెక్ట్​గా కుదరదు. దీంతో చేయడమే మానేస్తుంటారు. అయితే ఇకపై అటువంటిది లేకుండా చాలా సింపుల్​ అండ్​ క్రంచీగా బెండకాయ ఫ్రై చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.

Wedding Style Bendakaya Fry
Wedding Style Bendakaya Fry (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

  • బెండకాయలు - అర కిలో
  • బియ్యప్పిండి - పావు కప్పు
  • శనగపిండి - పావు కప్పు
  • కార్న్​ఫ్లోర్​ - 2 టీస్పూన్లు
  • కారం - 2 టీస్పూన్లు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • జీలకర్ర పొడి - అర టీస్పూన్​
  • గరం మసాలా - అర టీస్పూన్​
  • ఆమ్​చూర్​ పొడి - అర టీస్పూన్​
  • పసుపు - పావు టీస్పూన్​
  • ధనియాల పొడి - 1 టీస్పూన్​
  • పల్లీలు - పావు కప్పు
  • జీడిపప్పు పలుకులు - కొన్ని
  • దంచిన వెల్లుల్లి రెబ్బలు - 15
  • పచ్చిమిర్చి - 4
  • కరివేపాకు - గుప్పెడు
Wedding Style Bendakaya Fry
Wedding Style Bendakaya Fry (Getty Images)

తయారీ విధానం:

  • బెండకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా కాటన్​ క్లాత్​తో తుడిచి చివర్లు కట్​ చేయాలి. అనంతరం ఒక్కో బెండకాయను మరీ సన్నగా, మరీ లావుగా కాకుండా మీడియం సైజ్​లో ముక్కలుగా కట్​ చేసుకోవాలి. ఇలానే బెండకాయలన్నింటినీ కట్​ చేసుకుని ప్లేట్​లోకి తీసి పక్కన పెట్టాలి.
  • మిక్సింగ్​ బౌల్​లోకి బియ్యప్పిండి, శనగపిండి, కార్న్​ఫ్లోర్​, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, ఆమ్​చూర్​ పౌడర్​, పసుపు వేసి పదార్థాలు మొత్తం కలిసేలా మిక్స్​ చేసుకోవాలి.
Wedding Style Bendakaya Fry
Wedding Style Bendakaya Fry (Getty Images)
  • అనంతరం కట్​ చేసిన బెండకాయ ముక్కలను ఈ బియ్యప్పిండి మిశ్రమంలోకి వేసి అంతా కలిసేలా మిక్స్​ చేసుకోవాలి.
  • ముక్కలకు పిండి పట్టేలా కలుపుకున్నాక లైట్​గా నీళ్లను చిలకరించుకుంటూ కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి మొత్తం ముక్కలకు పడుతుంది. అలా అనీ మరీ జారుడుగా కాకుండా కాస్త గట్టిగానే కలుపుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి డీప్​ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. కాగిన నూనెలో పల్లీలు వేసి లో ఫ్లేమ్​లో క్రిస్పీగా వేయించాలి.
Wedding Style Bendakaya Fry
Wedding Style Bendakaya Fry (Getty Images)
  • పల్లీలు వేగిన తర్వాత తీసి ప్లేట్​లోకి వేసుకోవాలి. ఇలానే జీడిపప్పు, దంచిన వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకును విడివిడిగా క్రిస్పీగా వేయించి గిన్నెలోకి తీసుకోవాలి.
  • వేయించిన పల్లీల మిశ్రమంలో అర టీస్పూన్​ ఉప్పు, కారం, అర టీస్పూన్​ గరం మసాలా వేసి అంతా కలిసేలా మిక్స్​ చేసుకోవాలి.
Wedding Style Bendakaya Fry
Wedding Style Bendakaya Fry (Getty Images)
  • ఇప్పుడు కాగుతున్న నూనెలో కోట్​ చేసిన బెండకాయ ముక్కలను విడివిడిగా వేసుకోవాలి. కడాయికి సరిపడా వేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్​లో పెట్టి క్రిస్పీగా అయ్యేవరకు వేయించుకోవాలి.
  • బెండకాయ ముక్కలు పర్ఫెక్ట్​గా వేగిన తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి. మిగిలిన ముక్కలను కూడా ఇలానే వేయించుకోవాలి.
  • చివరగా ఇలా ఫ్రై చేసిన బెండకాయ ముక్కలను వేయించిన పల్లీల మిశ్రమంలో వేసి అంతా కలిసేలా మిక్స్​ చేసుకుంటే సరి. వెడ్డింగ్​ స్టైల్​ బెండకాయ ఫ్రై రెడీ.
Wedding Style Bendakaya Fry
Wedding Style Bendakaya Fry (ETV Bharat)

చిట్కాలు:

  • బెండకాయలు తడి లేకుండా పూర్తిగా తుడుచుకున్న తర్వాత మాత్రమే ముక్కలుగా కట్​ చేసుకోవాలి.
  • కార్న్​ఫ్లోర్​ బదులు మైదా, ఆమ్​చూర్​ పౌడర్​ బదులు నిమ్మరసం యాడ్​ చేసుకోవాలి. అయితే నిమ్మరసాన్ని మాత్రం బెండకాయ ముక్కలను పొడి పిండితో కోట్​ చేసి వాటర్​ కలిపేటప్పుడు యాడ్​ చేసుకోవాలి.

పాతకాలం పద్ధతిలో "రాగి అంబలి" - తయారీ సింపుల్​ - టేస్ట్​ వేరే లెవల్​!

మటన్​ కీమాతో అద్దిరిపోయే "సమోసాలు" -పైన క్రంచీ, లోపల జ్యూసీగా!