ETV Bharat / offbeat

"విజయవాడ టు తిరుపతి" కొత్తగా వందేభారత్ - నాలుగున్నర గంటల్లోనే చేరుకునే అవకాశం!

విజయవాడ - తిరుపతి - బెంగళూరు వందేభారత్ ఎక్స్​ప్రెస్ - ముహూర్తం ఫిక్స్ రూట్, షెడ్యూల్ ఇదే!

vijayawada_bangalore_vande_bharat_train
vijayawada_bangalore_vande_bharat_train (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : November 10, 2025 at 11:05 AM IST

2 Min Read
Choose ETV Bharat

Vijayawada Bangalore Vande Bharat Train : విజయవాడ నుంచి తిరుపతి వెళ్లడానికి మరో ట్రైయిన్ సిద్ధమైంది. ఈ వందే భారత్ రైలు (20711) కేవలం కేవలం నాలుగున్నర గంటల్లోనే విజయవాడ నుంచి తిరుపతికి చేరుకోవడం విశేషం. విజయవాడ - బెంగళూరు మధ్య నడిచే వందే భారత్ రైలు ప్రతిపాదనలు గత మే నెలలోనే సిద్ధం కాగా, ఈ నెలాఖరులో ప్రారంభం కానుంది. విజయవాడ నుంచి బెంగళూరుకు కేవలం తొమ్మిది గంటల్లోనే చేరుకోవచ్చు. మొత్తం 8 బోగీలు, 7 AC చైర్‌కార్, ఒకటి ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌ కలిగిన బెంగళూరు ట్రెయిన్ తిరుపతి వెళ్లే భక్తులకూ ఉపయోగపడనుంది.

"కొట్టాయం బండొచ్చె, శబరిమల కొండొచ్చె" - శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు, రిజర్వేషన్ మొదలైంది స్వామీ!

విజయవాడ - బెంగళూరు ఈ వందే భారత్ ట్రైన్ మంగళవారం మినహా మిగతా అన్ని రోజుల్లో అందుబాటులో ఉంటుంది. విజయవాడలో తెల్లవారుజామున 5.15 గంటలకు బయలుదేరి తెనాలి, ఒంగోలు నెల్లూరు మీదుగా ఉదయం 9.45గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అదే విధంగా చిత్తూరు, కాట్పాడి జంక్షన్, కృష్ణరాజపురం మీదుగా బెంగళూరు (SMVT)కి మధ్యాహ్నం 2.15గంటలకు చేరుతుంది. అంటే తిరుపతి వెళ్లే యాత్రికులు కేవలం నాలుగున్నర గంటల్లోనే విజయవాడ నుంచి చేరుకోవచ్చు. అదే విధంగా తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ (20712) బెంగళూరులో మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరి కృష్ణరాజపురం, కాట్పాడి, జంక్షన్, చిత్తూరు మీదుగా సాయంత్రం 6.55గంటలకు తిరుపతి చేరుకుంటుంది. నెల్లూరు, ఒంగోలు, తెనాలి మీదుగా రాత్రి 11.45గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

రూట్ షెడ్యూల్ ఇదే

విజయవాడ - బెంగళూరు ట్రైన్ (20711)

  • విజయవాడ 5.15
  • తెనాలి 5.39
  • ఒంగోలు 6.28
  • నెల్లూరు 7.43
  • తిరుపతి 9.45
  • చిత్తూరు 10.27
  • కాట్పాడి 11.13
  • కృష్ణరాజపురం 13.38
  • ఎస్‌ఎంవీటీ బెంగళూరు 14.15

బెంగళూరు - విజయవాడ ట్రైన్ (20712)

  • బెంగళూరు 14.45
  • కృష్ణరాజపురం 14.58
  • కాట్పాడి 17.23
  • చిత్తూరు 17.49
  • తిరుపతి 18.55
  • నెల్లూరు 20.18
  • ఒంగోలు 21.29
  • తెనాలి 22.42
  • విజయవాడ 23.45

విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లాలంటే ఇప్పటివరకు మచిలీపట్నం - యశ్వంతపూర్‌ "కొండవీడు ఎక్స్‌ప్రెస్‌" మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంది. ఈ ట్రెయిన్ వారానికి మూడు రోజులు మాత్రమే నడుస్తుంది. ఈ నేపథ్యంలో త్వరలో రాబోయే వందే భారత్‌ ట్రైన్​తో తక్కువ సమయంలోనే తిరుపతి సహా, నెల్లూరు, బెంగళూరు చేరుకోవచ్చు.

ఇదిలా ఉండగా విజయవాడ నుంచి మరో వందేభారత్ పట్టాలెక్కనుంది. ఇప్పటికే విజయవాడ నుంచి చెన్నై వరకు నడుస్తున్న వందేభారత్ ను తాజాగా గుడివాడ, భీమవరం లో హాల్ట్ సౌకర్యం కల్పిస్తూ నర్సాపురం వరకు పొడిగించారు. తాజాగా విజయవాడ - తిరుపతి - బెంగళూరు రైలు ఈ నెలాఖరున ప్రారంభం కానుంది.

శబరిమలలో "రూమ్ బుకింగ్" - ఆన్​లైన్​లో ఇలా చేసుకోవచ్చు!

పాస్​పోర్ట్ కావాలా? - ఇలా ఆన్​లైన్​లో సింపుల్​గా అప్లై చేసుకోండి!