ETV Bharat / offbeat

హెల్దీ, టేస్టీ 'స్ప్రౌట్స్ సలాడ్' - బ్యాచిలర్స్ కూడా ఈజీగా, ఫాస్ట్​గా చేసుకోవచ్చు!

మొలకలతో సింపుల్​గా చేసుకునే రెసిపీ - ఈ పద్ధతిలో కొత్తవారు కూడా సింపుల్​గా చేయవచ్చు!

Vegetable Sprouts Salad
Vegetable Sprouts Salad (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 15, 2026 at 4:03 PM IST

2 Min Read
Choose ETV Bharat

Sprouts Poha Recipe in Telugu: నేటి కాలంలో మొలకలను ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. అయితే వీటిని పచ్చిగా తినాలంటే చాలా మంది అంతగా ఆసక్తి చూపరు. అందుకే ఈరోజు మీకోసం ఓ సరికొత్త రెసిపీని తీసుకొచ్చాం. అదే స్ప్రౌట్స్ సలాడ్​. ఈ పద్ధతిని పాటిస్తూ నిమిషాల్లోనే దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్​ కూడా ఈ స్టెప్స్​ పాటిస్తూ​ ఈజీగా చేసేయచ్చు. కొత్తగా చేసే వారు కూడా ఇలా చేస్తే ఇన్​స్టంట్​గా తయారవుతుంది. ఇది బ్రేక్​ఫాస్ట్​తో పాటు సాయంత్రం స్నాక్​గానూ సూపర్​గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలి? ఇందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఘుమఘుమలాడే చేపల కర్రీ - ముక్క గట్టిగా, పులుసు చిక్కగా ఉండాలంటే ఇలా ట్రై చేయండి!

Vegetable Sprouts Salad
మొలకలు (ETV Bharat)

కావాల్సిన పదార్థాలు :

  • టమోటాలు - 1
  • క్యారెట్ - 1
  • మొక్కజొన్న గింజలు - ఒక కప్పు
  • కీరదోసకాయ ముక్కలు - ఒక కప్పు
  • పల్లీలు, పెసర్లు, శనగలు - ఒక కప్పు
  • కొత్తిమీర - కొద్దిగా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఆలివ్ ఆయిల్ - 1 టేబుల్ స్పూన్
  • నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
  • మిరియాల పొడి - పావు టీ స్పూన్
  • మయోనీస్ - 1 టేబుల్ స్పూన్
  • ఓరిగానో - కొద్దిగా
  • క్యాప్సికం - 1
  • ఉల్లిపాయ - 1
Vegetable Sprouts Salad
క్యారెట్ ముక్కలు (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా కప్పు పరిమాణంలో పల్లీలు, పెసర్లు, శనగలు వేసి ఆరు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత వీటిని వస్త్రంలో చుట్టి, మొలకలు వచ్చిన తర్వాత తీసి పక్కనుంచాలి.
  • అదేవిధంగా ఒక టమోటా, ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ, ఒక క్యాప్సికంను తరిగి ఉంచాలి. అలాగే కప్పు పరిమాణంలో కీరదోసకాయలను కట్ చేసుకోవాలి.
Vegetable Sprouts Salad
మొక్కజొన్నలు (Getty Images)
  • ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసి గిన్నెలో కప్పు మొక్కజొన్న గింజలు, సరిపడా నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి.
  • ఇప్పుడు సలాడ్ కోసం మిక్సింగ్ బౌల్లో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, టమోటా ముక్కలు, ఉడికించి మొక్కజొన్న గింజలు వేయాలి. అదేవిధంగా తరిగి ఉంచిన కప్పు కీరదోసకాయ ముక్కలు, ఉల్లిపాయ, క్యాప్సికం ముక్కలు, పెసర్లుశనగల మిశ్రమం, కొద్దిగా కొత్తిమీర, కొంచెం ఉప్పు యాడ్ చేసి మిక్స్ చేయాలి.
Vegetable Sprouts Salad
టమోటాలు (Getty Images)
  • మరోవైపు గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసి కలపాలి.
  • తయారు చేసుకున్న ఆలివ్​ ఆయిల్​ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లో ఉన్న సలాడ్​లో వేయాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ మయోనీస్, కొద్దిగా ఓరిగానో వేసి మిక్స్ చేయాలి.
Vegetable Sprouts Salad
కొత్తిమీర (Getty Images)
  • అంతే కమ్మని వెజిటేబుల్ స్ప్రౌట్స్ సలాడ్ రెడీ అయినట్లే!
  • ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే ఇంటిల్లిపాదీకి ఫేవరెట్ రెసిపీగా మారుతుంది.

ఆలూ కాంబో​లో అద్దిరిపోయే "బ్రోకలీ కర్రీ" - పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు!

స్టఫింగ్ లేకుండానే "గుత్తి వంకాయ కర్రీ" - అన్నం, పులావ్, రోటీల్లోకి అద్దిరిపోద్ది!