అసలైన "ఆంధ్రా పులావ్" - ఇలా చేశారంటే కమ్మగా లాగించేస్తారు!
ఆంధ్రా స్టైల్ వెజ్ పులావ్ రెసిపీ - సింపుల్‌గా ఇలా ట్రై చేసి టేస్ట్ చేయండి
andhra_style_pulav (Getty images)

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 3, 2026 at 12:22 PM IST
ANDHRA STYLE PULAV : బిర్యానీ, పులావ్ తయారీ విధానం ఒక్కటే కానీ, స్వల్ప తేడా ఉంటుంది. దమ్ బిర్యానీ ఇంకా భిన్నంగా ఉంటుంది. ఇపుడు మనం ఆంధ్రా స్టైల్ వెజ్ పులావ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. పులావ్ అంటే ఆంధ్రా, ఆంధ్రా అనగానే పులావ్ గుర్తురావడం సహజమే.
ఫారం చికెన్‌తో "నాటు కోడి టేస్ట్" - మసాలా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలు!

కావల్సిన పదార్థాలు :
- బాస్మతి బియ్యం - అర కేజీ
- బంగాళాదుంప - 1
- కాలీఫ్లవర్ - 1 గిన్నె
- క్యారెట్ - 1 కప్పు
- బీన్స్ - 1 గిన్నె
- బఠానీలు - 1 గిన్నె
- నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
- నూనె - 1 టేబుల్ స్పూన్
- బిర్యానీ ఆకు - 1
- జీడిపప్పు - 15
- ఉల్లిపాయ - 2
- పచ్చిమిర్చి - 3
- ఉప్పు - రుచికి సరిపడా

మసాలా పేస్ట్ కోసం :
- దాల్చిన చెక్క - 1 ఇంచు
- లవంగాలు - 3
- యాలకులు - 3
- అనాస పువ్వు - 1
- మరాఠీ మొగ్గ - 1
- జాజికాయ - సగం
- జాపత్రి - కొద్దిగా
- గసగసాలు - 1 స్పూన్
- ధనియాలు - 1 స్పూన్
- జీలకర్ర - 1 స్పూన్
- మిరియాలు - 1 స్పూన్
- రాతి పువ్వు - కొద్దిగా
- అల్లం - 2 ఇంచులు
- వెల్లుల్లి - 3 రెబ్బలు
- కొబ్బరి - 2 టేబుల్ స్పూన్ల
- టమాటో - 1
- కొత్తిమీర - కొద్దిగా
- పుదీనా ఆకులు - కొద్దిగా
- నీళ్లు - కొద్దిగా

తయారీ విధానం :
- ముందుగా మిక్సీ జార్ తీసుకుని మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జాజికాయ, జాపత్రి, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, రాతి పువ్వు వేసుకుని గ్రైండ్ చేయాలి.
- అందులోనే అల్లం, వెల్లుల్లి రెబ్బలు, కొబ్బరి ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా వేసుకుని మరో సారి వాటన్నింటినీ ఒకసారి గ్రైండ్ చేయాలి. కొద్దిగా నీళ్లు కూడా పోసి చివరగా మెత్తని పేస్ట్ చేసుకుని పక్కకు తీసుకోవాలి.

- ఇపుడు స్టవ్‌పై గిన్నె పెట్టుకుని నెయ్యి, నూనె వేసుకుని వేడెక్కగానే బిర్యానీ ఆకు, జీడిపప్పు వేయించాలి. జీడిపప్పు దోరగా వేయించాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీలికలు వేసుకుని ఉల్లిపాయలు రంగు మారే వరు వేయించాలి.
- ఆ తర్వాత ముందుగా బంగాళాదుంప ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు 1 నిమిషం పాటు వేయించిన తర్వాత తరిగిన క్యారెట్లు, బీన్స్, పచ్చి బఠానీలు వేయించాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి 2 స్పూన్ల నీళ్లు పోసి కలిపి మూతపెట్టి, మంట తగ్గించి సుమారు 5 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసుకుని ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ వేసి కలిపి ఐదారు నిమిషాలు వేయించాలి.

- ఇపుడు నానబెట్టిన బాస్మతి బియ్యం కూడా వేసి కాస్త మగ్గించాలి. ఆ తర్వాత నీళ్లు పోసి కలిపి మూతపెట్టుకుని లో ఫ్లేమ్‌లో 15 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి మూత తీసుకుని పై నుంచి 1 స్పూన్ నెయ్యి వేసి సర్వ్ చేసుకుంటే చాలు! ఈ పులావ్ రైతా, మిర్చి కా సాలన్తో తింటే అద్భుతంగా ఉంటుంది.
చల్లని క్లైమేట్లో "కంది పొడి రసం" - ఘాటుగా గొంతులోకి దింగుతుంటే ఆ కిక్కే వేరబ్బా!
అమ్మమ్మ స్టైల్ "నాటు చిక్కుడు పచ్చడి" - ఈ రెసిపీ పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది!

