ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలనే "చేపల కుర్మా" - పిల్లలకూ బాగా నచ్చేస్తుంది!
ఎప్పుడైనా "ఫిష్ కుర్మా" ట్రై చేశారా? - నీచు వాసన లేకుండా టేస్ట్ అద్దిరిపోతుంది!

Published : February 22, 2026 at 10:17 AM IST
Variety Fish Curry for Non Vegitarians : మనందరం నార్మల్‌గా ఆదివారమో, హాలీడే ఉన్న రోజో లేదా ఇంటికి బంధువులు వచ్చినప్పుడో ప్రత్యేక వంటలు ప్రిపేర్ చేసుకుంటుంటాం. అందులోనూ నాన్‌వెజ్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటాం. చికెన్, మటన్‌తో పాటు చేపలు తెస్తుంటాం. అయితే, చాలా మంది చేపలు తెచ్చారంటే పులుసు, కూర, ఫ్రై వంటివి ఎక్కువగా వండుతుంటారు. అలాగని ఎప్పుడూ అవే తినాలంటే నోటికి అంతగా రుచించవు. అందుకే, ఈ సండే ఒక నయా రెసిపీతో మీ ముందుకు వచ్చాం. అదే, నోరూరించే "చేపల కుర్మా". ఇది నార్మల్‌గా చేసుకునే వాటితో పోల్చితే డిఫరెంట్ టేస్ట్‌తో భలే కమ్మగా ఉంటుంది. ఈ కొలత ప్రకారం ఇలా వండారంటే ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ తింటారు. పిల్లలకూ చాలా బాగా నచ్చేస్తుంది. అలాగే, చిక్కటి గ్రేవీతో అన్నంలోకే కాకుండా చపాతీ, రుమాలీ రోటీ, పరోటా ఎందులోకైనా అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు, ఒక్కసారి దీన్ని తిన్నారంటే మళ్లీ మళ్లీ చేసుకోవడం పక్కా! మరి, లేట్ చేయకుండా ఈ సూపర్ టేస్టీ ఫిష్ కుర్మాను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- కిలో - చేపలు
- రెండు కప్పులు - ఉల్లిపాయ తరుగు
- నాలుగైదు - పచ్చిమిర్చి
- నాలుగు స్పూన్లు - అల్లంవెల్లుల్లి పేస్ట్
- జీడిపప్పులు - 20
- రెండు కప్పులు - పెరుగు
- ధనియాల పొడి - రెండు స్పూన్లు
- రెండు స్పూన్లు - జీలకర్ర పొడి
- రెండు స్పూన్లు - గరంమసాలా
- ఒక స్పూన్ - పసుపు
- రుచికి తగినంత - ఉప్పు
- ఏడెనిమిది చెంచాలు - నూనె
- ఆరేడు - లవంగాలు
- నాలుగు - యాలకులు
- చిన్న ముక్క - దాల్చిన చెక్క
- రెండు - బిర్యానీ ఆకులు
- అర కప్పు - కొత్తిమీర తరుగు
హైదరాబాదీ వెడ్డింగ్ స్టైల్ "రెడ్ చికెన్" - వీకెండ్ ఇలా చేస్తే ఇంట్లో పండగే!

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా ఒక చిన్న గిన్నెలో జీడిపప్పులను తీసుకుని కొద్దిసేపు నానబెట్టుకోవాలి.
- అవి నానేలోపు రెండు కప్పుల పరిమాణంలో సన్నని ఉల్లిపాయ తరుగు, అర కప్పు కొత్తిమీర తరుగును ప్రిపేర్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మీకు నచ్చిన ఫ్రెష్ చేపలను తీసుకుని శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకోవాలి.
- ఆపై వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో కాస్త పసుపు, ఉప్పు వేసి కలిపి కాసేపు పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్లో నానబెట్టుకున్న జీడిపప్పులను కాస్త వాటర్ వేసుకుని మెత్తని ముద్దలా గ్రైండ్ చేసుకుని పక్కనుంచాలి. అలాగే, పెరుగును కాస్త పలుచగా గిలకొట్టి రెడీగా ఉంచుకోవాలి.
- అనంతరం కర్రీ తయారీకి స్టవ్ మీద పాన్‌లో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, బిర్యానీ ఆకులు వేసి దోరగా వేయించాలి.
- అవి వేగి మంచి స్మెల్ వస్తున్నప్పుడు అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ ముక్కలు వేసి లో ఫ్లేమ్‌లో గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఆనియన్స్‌ను ఆవిధంగా వేయించుకున్నాక అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని పచ్చివాసన పోయే వరకు కాసేపు వేయించాలి.

- అనంతరం ఆ మిశ్రమంలో ముందుగా మారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు, అర కప్పు గోరువెచ్చని నీళ్లు యాడ్ చేసి ఒకసారి మంచిగా కలిపి మూతపెట్టి ఉడికించుకోవాలి.
- చేప ముక్కలు కాస్త ఉడికి మెత్తబడ్డాక ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరంమసాలా, పసుపు వేసి కలుపుకోవాలి.
- అలాగే, గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ కూడా జత చేసి ముక్కలకు పట్టేలా నెమ్మదిగా మంచిగా మిక్స్ చేసుకోవాలి.
- ముక్కలకు మసాలా మిశ్రమం మంచిగా పట్టిందనుకున్నాక గిలకొట్టి పెట్టుకున్న పెరుగును కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ కలియబెడుతుండాలి.

- పెరుగు మొత్తం వేసి కలిపిన తర్వాత మూతపెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి.
- ఆ మిశ్రమంలోని వాటర్ కాస్త ఇగిరిపోయి చిక్కటి గ్రేవీ రెడీ అయ్యి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు చివర్లో కట్ చేసి పెట్టుకున్న సన్నని కొత్తిమీర తరుగు చల్లుకుని దింపేసుకుంటే చాలు.
- అంతే, ఎన్నడూ తినని సరికొత్త రుచిలో నోరూరించే "ఫిష్ కుర్మా" సింపుల్‌గా రెడీ అవుతుంది!
- మరి, నచ్చితే మీరూ ఈ సండే ఎప్పుడూ ఒకే రకమైన నాన్‌వెజ్ రెసిపీలు కాకుండా ఇలా వెరైటీగా చేపల కుర్మా ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ సూపర్ టేస్ట్ అంటూ కమ్మగా తినేస్తారు.

సండే స్పెషల్: పండుమిర్చితో "చికెన్ పచ్చడి" - చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది!
నోరూరించే "చికెన్ తహారీ" - టేస్ట్ కా బాప్! - ఈజీగా చేసుకోండిలా

