ఘుమఘుమలాడే "వంకాయ జీడిపప్పు మసాలా" - ఇలాంటి కర్రీ అద్భుతంగా ఉంటుంది!
వంకాయ సింపుల్ రెసిపీ - ఇలా చేశారంటే కమ్మగా తినేయొచ్చు!
vankaya_jeedipappu_curry (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 7, 2026 at 1:10 PM IST
vankaya jeedipappu curry in telugu : వంకాయ కర్రీలో జీడిపప్పు, మసాలా వేశామంటే నోరూరిపోతుంది. సహజంగానే వంకాయ రుచి మనకు తెలిసిందే! కానీ, ఎపుడైనా ఇలా ట్రై చేసి చూడండి! వేడి వేడి అన్నంలోకి 'అమృతమే' అన్నట్టుగా అద్భుతంగా ఉంటుంది. కొద్దిగా పొడవైన నీలిరంగు వంకాయలు, జీడిపప్పు రెడీగా పెట్టుకుని ఇక్కడ ఇచ్చిన స్టెప్స్ ఫాలో చేయండి.
"పుదీనా పచ్చడి" నచ్చట్లేదా? - ఓసారి ఇలా "కారం పొడి" ట్రై చేయండి!

కావల్సిన పదార్థాలు :
- వంకాయలు - అర కేజీ
- జీడిపప్పు - 20
- నూనె - 4 టేబుల్ స్పూన్లు
- ఎండు మిర్చి - 5
- ధనియాలు - 1 టేబుల్ స్పూన్
- దాల్చిన చెక్క - 1 ఇంచు
- యాలకులు - 3
- జీలకర్ర - 1 స్పూన్
- ఉల్లిపాయ - 1 పెద్దది
- పచ్చిమిర్చి - 3
- కరివేపాకు - 1 రెమ్మ
- అల్లం వెలుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - అర స్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం :
- ముందుగా వంకాయలు శుభ్రం చేసుకుని ముక్కలు కట్ చేసుకుని ఉప్పు నీళ్లలో వేసుకోవాలి. ఆ తర్వాత కారం కోసం స్టవ్‌పై కడాయి పెట్టుకుని నూనె వేసుకుని జీడిపప్పు వేయించాలి. మాడిపోకుండా జాగ్రత్తగా ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

- ఇపుడు అదే నూనెలో ఎండు మిర్చి, ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసుకుని సువాసన భరింతగా సన్నటి మంటపై వేయించాలి. ఎండు మిర్చి రంగు మారిన తర్వాత జీలకర్ర వేసుకుని వేయించి పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పులో సగం పక్కన పెట్టుకుని మరో సగం మిక్సీలో వేసి వేయించిన మసాలా దినుసులు కలిపి గ్రైండ్ చేసుకోవాలి.

- ఇపుడు కడాయిలో కొద్దిగా నూనె వేసుకుని అరకప్పు ఉల్లిపాయ తరుగు వేసుకుని వేయించాలి. అందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు, టేబుల్ స్పూన్ అల్లం వెలుల్లి పేస్ట్ వేసుకుని వేయించాలి. వాసన పోయిన తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి మాడిపోకుండా బాగా కలపాలి.

- ఇపుడు వేగిన కారాల్లో వంకాయ ముక్కలు వేసుకుని బాగా కలపాలి. మూతపెట్టుకుని ఐదారు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో నూనెలో మగ్గించాలి. ఆ తర్వాత మరో సారి కలిపి మరో ఐదు నిమిషాలు సన్నటి మంటపై మగ్గించి ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి కూడా వేసి కలుపుకోవాలి.
- ఇపుడు కొద్దిగా నీళ్లు చిలకరించి మూతపెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత పక్కన పెట్టుకున్న సగం జీడిపప్పుతో పాటు కొత్తిమీర తరుగు వేసి కలిపి దించుకుంటే చాలు! ఎంతో రుచికరమైన వంకాయ జీడిపప్పు కర్రీ రెడీగా ఉంటుంది.
రెస్టారెంట్ స్టైల్ "బెండకాయ మసాలా కర్రీ" - ఇంటిల్లిపాదీకి తెగ నచ్చేస్తుంది!
ఎన్నడూ తినని రుచితో "గోంగూర వంకాయ క్రరీ" - వేడివేడి అన్నంలోకి అమృతమే!

