ETV Bharat / offbeat

'రూ.5 ట్రాక్టర్ నోటు' మీ దగ్గర ఉందా? - ఆన్​లైన్ మార్కెట్​లో లక్షలు పలుకుతుందా?

పాత కరెన్సీ నోట్లకు లక్షలు ఇస్తామంటూ ప్రకటనలు - ఏమేం పరిశీలించాలి?

5 రూపాయల కరెన్సీ నోటు
Tractor 5 Rupee Note Value (Getty images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 27, 2026 at 3:14 PM IST

2 Min Read
Choose ETV Bharat

Tractor 5 Rupee Note Value : నాణేలు, వివిధ దేశాల కరెన్సీ నోట్ల సేకరణ చాలా మంది హాబీ. ఇదే క్రమంలో అరుదైన నాణేలు, కరెన్సీ నోట్లు లక్షలు పలుకుతున్నాయంటూ ఆన్​లైన్​లో పలు ప్రకటనలూ చూసే ఉంటాం. ఇలాంటి ప్రకటనలు నిజమేనా? పాత కరెన్సీ నోట్లు నిజంగా లక్షలు పలుకుతాయా? ఈ మధ్య 'పొలం దున్నుతున్న ట్రాక్టర్ ఫొటో' కలిగిన 5రూపాయల నోటు విశేషంగా ప్రచారంలోకి వచ్చింది. ఇలాంటి నోటు మీ దగ్గర ఉందా? 123 లేదా 786 సీరియల్ నంబర్ ఉంటే చాలు! కోట్ల రూపాయలు మీ సొంతం అనే ప్రకటనలూ గమనించే ఉంటారు.

పాత ₹5 ట్రాక్టర్ నోటు ప్రత్యేకమైనదా?

నాణేల సేకరణ, కరెన్సీ నోట్ల సేకరణ హాబీగా ఉన్న వారు వాటిని సొంతం చేసుకోవడానికి రెట్టింపు ధర ఇవ్వడానికి ఇష్టపడతారు తప్ప లక్షలు ఎందుకు చెల్లిస్తారు? ఒక వేళ మతపరమైన సీరియల్ నంబర్లు ఉంటే నోటుకు పదిరెట్లు అదనంగా చెల్లిస్తారే తప్ప లక్షల రూపాయలు ఇవ్వడానికి ఇష్టపడతారా? ఆలోచించుకోవాలి.

అనలాగ్ పనీర్​పై కర్ణాటకలో నిషేధం - ఇప్పటికే బ్యాన్ చేసిన చత్తీస్​గఢ్, మహారాష్ట్ర!

₹5 ట్రాక్టర్ నోటు నిజంగా లక్షలు సంపాదించిపెట్టగలదా?

అరుదైన ₹5 ట్రాక్టర్ నోట్లు చాలా అధిక ధరలను పొందగలవని ఆన్‌లైన్ ప్రకటనలు కనిపిస్తుంటాయి. సహజంగా పర్సులో, పెట్టెలో లేదా సేకరణలో భాగంగా దాచుకున్న వారిలో ఆసక్తి రేకెత్తిస్తాయి. దాని విలువపై కొత్త ఆసక్తిని కలిగిస్తుంటాయి. ఫలితంగా ఆన్​లైన్​లో వచ్చే ప్రకటనలకు ఆకర్షితులవుతుంటారు. ఇక అక్కడే అసలు విషయం బయటపడుతుంది. కానీ, ఏ కరెన్సీ నోటైనా డిమాండ్, ప్రామాణికత, అరుదుగా లభించడం తదితర కారణాల వల్ల కాస్త విలువ అదనంగా ఉంటుంది. అంతే తప్ప ప్రతి పాత ₹5 ట్రాక్టర్ నోటుకు వర్తించే ఒక స్థిరమైన ధర అంటూ ఏదీ లేదు. ఇలాంటి ప్రకటనలతో అమ్మకాలు, కొనుగోళ్ల పేరిట సైబర్ ఉచ్చులోకి లాగేస్తారు. ఖాతాలో ఉన్న సొమ్మంతా ఊడ్చేస్తారు. ఇలాంటి కేసులు అనేకం ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్నాయని పోలీస్ శాఖ గగ్గోలు పెడుతోంది.

పాత నోట్లను ఎక్కడ అమ్ముతారు?

  • కేవలం నోటు పాతదైనంత మాత్రాన విలువైనది కాదు.
  • పాత నోట్లను అమ్మాలనుకునే వ్యక్తులు సాధారణంగా ఒక ఖాతాను సృష్టించుకుని, నోటు ఫొటోలను అప్‌లోడ్ చేసి, దాని విలువ, పరిస్థితి, ముద్రించిన సంవత్సరం, సీరియల్ నంబర్ వంటి వివరాలను పోస్ట్ చేస్తారు.
  • నోటుకు రెండు వైపులా ఉన్న స్పష్టమైన ఫొటోలు, కొనుగోలుదారులు వస్తువును అంచనా వేయడానికి సహాయపడతాయి.
  • ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు ఆఫర్ చేయడానికి వీలుగా, అమ్మకందారులు ప్లాట్‌ఫారమ్ ద్వారా సంప్రదింపు వివరాలను కూడా అందించవచ్చు.

ఏమేం తనిఖీ చేయాలి?

  • పాత కరెన్సీ నోటు అసలైనదేనా? లేదా నకిలీదా? అని చెక్ చేసుకోవాలి. ఆ నోటుకు ఎంత డిమాండ్ ఉంటుందో ముందుగా నిర్ధారించుకోవాలి.
  • అమ్మకాలు, కొనుగోళ్ల ప్రక్రియలో ఇరువైపులా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముందస్తు చెల్లింపుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీలు షేర్ చేయకూడదు.

వనస్పతి, హైడ్రోజనేటెడ్ కొవ్వులతో 'కల్తీ నెయ్యి' తయారీ - ఇంట్లోనే ఈజీగా కనిపెట్టేయండి!

'డీప్ ఫ్రిజ్' గడ్డకడితే మీరేం చేస్తారు? - టెక్నీషియన్లు సూచిస్తున్న సింపుల్ టిప్స్!