ETV Bharat / offbeat

కమ్మని "ఉసిరికాయ రోటి పచ్చడి" - వేడివేడి అన్నంలోకి అమృతమే - అప్పటికప్పుడు చేసుకోవచ్చు!

-రెగ్యులర్ రోటి పచ్చళ్లను మించిన టేస్ట్ - ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ తింటారు!

Usirikaya Roti Pachadi Recipe
Usirikaya Roti Pachadi Recipe (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : October 23, 2025 at 2:02 PM IST

2 Min Read
Choose ETV Bharat

Usirikaya Roti Pachadi Recipe : కార్తికమాసం అంటే ఉసిరికాయల సీజన్. ఈ క్రమంలోనే ఉసిరి ఆరోగ్యానికి మంచిదని చాలా మంది పచ్చడి నుంచి పప్పు వరకు రకరకాల రెసిపీలు ట్రై చేస్తుంటారు. అయితే, ఎక్కువ మంది ఊసిరికాయతో ఊరగాయను పెడుతుంటారు. అలాకాకుండా ఓసారి ఇలా ఉసిరితో "రోటి పచ్చడి" ట్రై చేయండి. ఎన్నడూ తినని రుచిలో సరికొత్తగా భలే కమ్మగా ఉంటుంది. అలాగే, దీని తయారీకి ఎక్కువ టైమ్ కూడా పట్టదు. ఎవరైనా ఈ పచ్చడిని అప్పటికప్పుడు చాలా సింపుల్​గా తయారు చేసుకోవచ్చు. మొదటిసారి చేసేవారైనా ఈ కొలతలతో చేశారంటే పర్ఫెక్ట్​గా కుదురుతుంది. ఇది వేడి వేడి అన్నంలోకి అద్దిరిపోయే రుచినిస్తుంది. పిల్లలు కూడా ఈ పచ్చడిని ఎంతో ఇష్టంగా తింటారు. మరి, నోరూరించే ఈ ఉసిరికాయ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Usirikaya Roti Pachadi Recipe
ఉసిరికాయలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • ఒక పెద్ద కప్పు - ఉసిరికాయ ముక్కలు
  • పది - ఎండుమిర్చి
  • ఎనిమిది - పచ్చిమిర్చి
  • పావుకప్పు - నూనె
  • ఒక టేబుల్​స్పూన్ - శనగపప్పు
  • ఒక టేబుల్​స్పూన్ - మినప్పప్పు
  • ఒక చెంచా - ఆవాలు
  • ఒక చెంచా - ధనియాలు
  • ఒక చెంచా - జీలకర్ర
  • పావుచెంచా - మెంతులు
  • పావుచెంచా - ఇంగువ
  • రుచికి తగినంత - ఉప్పు
  • పావుచెంచా - పసుపు
  • నాలుగైదు - వెల్లుల్లి రెబ్బలు

కార్తికమాసం స్పెషల్ : "వంకాయ చిక్కుడుకాయ పచ్చికారం" - ఉల్లి, వెల్లుల్లి లేకుండానే సూపర్ టేస్ట్​!

Usirikaya Roti Pachadi Recipe
ఎండుమిర్చి (Getty Images)

తయారీ విధానం :

  • ఈ నోరూరించే రోటి పచ్చడి తయారీ కోసం ముందుగా ఒక కప్పు పరిమాణంలో ఉసిరికాయలను గింజలు తీసేసుకుని ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం స్టవ్ మీద కడాయిలో ముప్పావువంత నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉసిరికాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. అవి మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్​లోకి తీసుకుని పక్కనుంచాలి.
Usirikaya Roti Pachadi Recipe
పచ్చిమిర్చి (Getty Images)
  • తర్వాత అదే కడాయిలో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ధనియాలు, మెంతులు వేసి వేయించాలి.
  • ఇవి వేగిన తర్వాత అందులో సగం చొప్పున శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి అన్నింటినీ చక్కగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • అనంతరం మిక్సీ జార్ తీసుకుని అందులో చల్లారిన ఎండుమిర్చి మిశ్రమం, వేయించి పక్కన పెట్టుకున్న ఉసిరిముక్కలు, పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకుని రోట్లో రుబ్బుకున్నట్లుగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుని పక్కనుంచాలి.
  • ఇప్పుడు అందులోకి తాలింపును సిద్ధం చేసుకోవాలి. పోపు కోసం స్టవ్ మీద చిన్న కడాయిలో మిగిలిన నూనె పోసి వేడి చేయాలి.
Usirikaya Roti Pachadi Recipe
వెల్లుల్లి (Getty Images)
  • ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, మిగిలిన తాలింపు దినుసులు వేసి లో ఫ్లేమ్​లో చక్కగా వేయించాలి.
  • తాలింపు మంచిగా వేగిందనుకున్నాక అందులో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చడిని వేసి మొత్తం కలిసేలా బాగా కలిపాలి.
  • తర్వాత పచ్చడి మొత్తాన్ని కాసేపు దోరగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. అంతే, ఎన్నడూ తినని రుచిలో వావ్ అనిపించే "ఉసిరికాయ రోటి పచ్చడి" రెడీ అవుతుంది!
  • మరి, నచ్చితే మీరు రెగ్యులర్ రోటి పచ్చళ్లకు బదులుగా ఓసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ కమ్మగా, కడుపునిండా తినేస్తారు. ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ చేసి పెట్టమని అడుగుతారు.
Usirikaya Roti Pachadi Recipe
పోపుదినుసులు (Getty Images)

చల్లని వేళ కరకరలాడే "పనీర్-కార్న్ వడలు" - తక్కువ టైమ్​లో అప్పటికప్పుడు రెడీ!

ఇడ్లీలు మిగిలితే కరకరలాడే "వడలు"! - తక్కువ నూనెతోనే అప్పటికప్పుడు రెడీ!