సింపుల్‌గా తయారయ్యే "ఉలవచారు" - ఈ రుచిని సూపర్‌గా ఎంజాయ్ చేస్తారు!
ఉలవలతో సింపుల్‌గా చేసుకునే రెసిపీ - ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 29, 2025 at 4:47 PM IST
Horse Gram Rasam Recipe : ఉలవచారు చాలా మందికి ఫేవరెట్ డిష్. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీన్ని ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని ఇంట్లో తయారు చేయడం కష్టమైన పనిగా కొందరు భావిస్తుంటారు. దీంతో తినాలనిపించినప్పుడల్లా బయట కొనుగోలు చేస్తుంటారు. ఒకవేళ కొంతమంది ఇంట్లో ప్రిపేర్ చేసినా సరైన టేస్ట్ రావట్లేదని మదనపడుతుంటారు. అలాంటి వారు ఓసారి ఈ పద్ధతిలో ఉలవచారు చేశారంటే సూపర్‌గా కుదురుతుంది.
అంతేకాక తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. కొత్తగా చేసే వారు కూడా ఈ స్టెప్స్ పాటిస్తూ చాలా సింపుల్‌గా తయారు చేయోచ్చు. ఇంట్లో ఇలా చేసి పెడితే ఇంటిల్లిపాదీకి ఫేవరెట్ రెసిపీగా మారుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ కమ్మని ఉలవచారు చేయడానికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం.
కమ్మని "పుట్టగొడుగుల పచ్చడి" - వేడివేడి అన్నంలోకి అల్టిమేట్ టేస్ట్‌తో అద్దిరిపోతుంది!

కావాల్సిన పదార్థాలు :
- ఉలవలు - 1 కప్పు
- తాలింపు దినుసులు - 1 టేబుల్ స్పూన్
- ఆయిల్ - 3 టేబుల్ స్పూన్లు
- కరివేపాకు - కొద్దిగా
- వెల్లుల్లి రెబ్బలు - 8
- ఉప్పు - రుచికి సరిపడా
- కారం - 1 టేబుల్ స్పూన్
- మిరియాల పొడి - 1 టీ స్పూన్
- చింతపండు - 30 గ్రాములు

తయారీ విధానం :
- ముందుగా గిన్నెలో కప్పు ఉలవలు వేసి ఆరు సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత సరిపడా నీళ్లు పోసి రాత్రంతా లేదా ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి.
- మరుసటి రోజు ఉదయం ఉలవలలోంచి నీటిని తీసేసి మరో రెండు సార్లు కడగాలి. ఆ తర్వాత వీటిని గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు పోసి స్టవ్‌పై పెట్టి ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

- అలా గిన్నెలో 30 గ్రాముల చింతపండు, సరిపడా నీళ్లు పోసి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. పదిహేను నిమిషాల తర్వాత రసం తీసి పక్కనుంచాలి.
- ఇప్పుడు మిక్సీజార్‌లో ఉడికించిన ఉలువలు, సరిపడా వాటర్ యాడ్ చేసి మెత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టాలి.

- ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసి పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి.
- ఇందులోనే ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు, గ్రైండ్ చేసుకున్న ఉలవల పేస్ట్, చింతపండు రసం వేసి కలపాలి. ఇప్పుడు సరిపడా నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసి మిక్స్ చేయాలి.
- అనంతరం మూతపెట్టి 20 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

- అంతే ఘుమఘుమలాడే ఉలవచారు సిద్ధంగా ఉంటుంది!
- వేడివేడి అన్నంలో ఉలవచారు వేసి తింటుంటే ఆ కిక్కే వేరు.
కొత్త సంవత్సరాన్ని తియ్యగా ప్రారంభిద్దాం - మీ కోసం సింపుల్ స్వీట్ రెసిపీ!
చిదంబరం స్పెషల్ "కలి" - దేవుడికి ఇలా నైవేద్యం చేసి పెట్టండి!

