ETV Bharat / offbeat

"mAadhaar Appకు రిటైర్మెంట్ ప్రకటించిన "UIDAI" - ఇపుడు QR స్కాన్ చేస్తే చాలు!

కొత్త ఆధార్ యాప్ వచ్చేసింది - వ్యక్తిగత సమాచారం ఇక భద్రం!

new_aadhaar_app
new_aadhaar_app (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 19, 2026 at 12:39 PM IST

2 Min Read
Choose ETV Bharat

New Aadhaar App : యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఒక కీలక ప్రకటన చేసింది. mAadhaar యాప్‌ను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు UIDAI అధికారికంగా ప్రకటించింది. అయితే, ఇటీవల ప్రారంభించిన ఆధార్ యాప్‌ను అందరూ ఉపయోగించాలని UIDAI సిఫార్సు చేస్తోంది. వినియోగదారులు దీనిని ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వివిధ పథకాలతో పాటు గుర్తింపు కార్డుగా ఆధార్​ను పరిగణిస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు వివరాలను అప్​డేట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

"UIDAI" ఆధార్ కార్డులో తండ్రి పేరు సవరించాలా? - ఆన్​లైన్​ ప్రాసెస్ ఇదే!

ఆధార్ కార్డును గుర్తింపుగా పరిగణిస్తున్న క్రమంలో అందులోని వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా కేంద్రం కొత్త ఆధార్ యాప్ తీసుకొచ్చింది. ఈ మేరకు mAadhaar యాప్​కు రిటైర్మెంట్ ప్రకటించేసింది.

UIDAI 2026 జనవరి 28న ఆధార్ యాప్ పూర్తి వెర్షన్‌ విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా మీరు ఎప్పుడైనా మీ ఆధార్ సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవచ్చు. అవసరమైతే, మీ ఆధార్ సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం కూడా ఇది సులభతరం చేస్తుంది.

గతంలో ఆధార్ కార్డులను డిజిటల్‌గా నిల్వ చేయడానికి మాత్రమే mAadhaar యాప్‌ను ప్రారంభించారు. అయితే, ఆ యాప్ ద్వారా ఎలాంటి సమాచారాన్ని అప్‌డేట్ చేయడం సాధ్యం కాలేదు. mAadhaar యాప్‌ను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు UIDAI 'X' అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఒక పోస్ట్‌లో ప్రకటించింది.

"mAadhaar యాప్‌ను నిలిపివేయబోతున్నామని, కొత్త ఆధార్ యాప్ మరింత స్మార్ట్, వేగవంతమైన, సురక్షితమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇందులో QR కోడ్ ఆధారిత షేరింగ్ ఆప్షన్ గోప్యతా నియంత్రణ సహా ఆధార్ సేవలను సులభంగా పొందే అనుభవాన్ని అందిస్తుంది. ఈ యాప్ ప్రయోజనాలు 13 భారతీయ భాషలలో అందుబాటులో ఉంటాయి." అని UIDAI వెల్లడించింది.

QR కోడ్ ఆధారిత గుర్తింపు ధ్రువీకరణ పద్ధతి కొత్త యాప్ అతిపెద్ద ప్రయోజనంగా చెప్పుకోవచ్చు. మీ ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, పుట్టిన తేదీ లేదా చిరునామాను వెల్లడించకుండా, కేవలం ఒక QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఆధార్ ధ్రువీకరణను సులభంగా పూర్తి చేయవచ్చు.

ఎలా పనిచేస్తుందంటే!

ఏదైనా పథకాలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా సిమ్ కార్డు కొనాలన్నా, బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలన్నా, దేవాలయాలకు వెళ్లే సమయాల్లోనూ ఆధార్ తప్పనిసరి గుర్తింపుగా పరిగణిస్తున్నారు. దీంతో జీరాక్స్ కాపీ ఇవ్వడం వల్ల మీ పేరు, పుట్టిన తేదీ, పూర్తి చిరునామా అవతలి వ్యక్తికి తెలిసే అవకాశం ఉంది. కానీ, కొత్త ఆధార్ యాప్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ధ్రువీకరణ ప్రక్రియ పూర్తవుతుంది.

మరణించిన వ్యక్తి ఆధార్‌ కార్డు యాక్టివ్​లో ఉందా? - కుటుంబ సభ్యులు జాగ్రత్త పడాల్సిందే!

కొత్త "Aadhaar" యాప్ వచ్చేసింది - ఫోన్​లోనే అడ్రస్​, మొబైల్ నంబర్ ఛేంజ్ చేసుకోవచ్చు!