ETV Bharat / offbeat

అలర్ట్ ​: నిలిచిపోనున్న "mAadhaar" - కొత్త యాప్​ డౌన్​లోడ్​ చేసుకోవాలన్న UIDAI

- సూపర్​ ఫీచర్లతో అందుబాటులో కొత్త ఆధార్​ యాప్​ - X వేదికగా ప్రకటన విడుదల చేసిన భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ!

New Aadhaar App Details in Telugu
New Aadhaar App Details in Telugu (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : May 30, 2026 at 1:43 PM IST

3 Min Read
Choose ETV Bharat

New Aadhaar App Details in Telugu: ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు పొందాలన్నా, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, స్కూళ్లు, కాలేజీలు.. ఇలా ఎక్కడ ఏ పని జరగాలన్నా ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు ఉండాల్సిందే. ఇంతటి విలువైన ఆధార్ దుర్వినియోగం కాకుండా ఉండేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI).. mAadhaar అనే మొబైల్ యాప్​ను తీసుకొచ్చింది. ప్రస్తుతం చాలా మంది దీనిని వాడుతున్నారు. అయితే తాజాగా ఈ యాప్​ విషయంలో UIDAI కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ యాప్​ను పూర్తిగా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ యాప్​ ప్లేస్​లో సరికొత్త ఫీచర్లతో కొత్త ఆధార్​ యాప్​ను తీసుకొచ్చింది. మరి ఈ కొత్త యాప్‌ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

ఆధార్ కార్డ్‌లో వివరాల అప్‌డేట్ కోసం ప్రస్తుతం ఎక్కువ మంది వాడుతున్నది mAadhaar యాప్. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ యాప్‌ ద్వారా ఆధార్‌‌లో వివరాలు మార్చుకోవచ్చు. అయితే, త్వరలో ఈ యాప్ పని చేయదని UIDAI ప్రకటించింది. దీని స్థానంలో వినియోగదారులు కొత్త ఆధార్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఎక్స్​ వేదికగా ప్రకటన విడుదల చేసింది. పాత యాప్ కంటే కొత్త యాప్ మరింత స్మార్ట్‌గా, వేగంగా, పూర్తిగా సురక్షితంగా ఉంటుందని తెలిపింది.

తేడా ఏంటి?: పాత mAadhaar యాప్‌లో లాగిన్ అయినప్పుడు పూర్తి వివరాలు స్క్రీన్ మీద కనిపించేవి. కానీ ఇప్పుడు ఈ కొత్త యాప్‌లో అలా ఉండదు. భద్రత కోసం దీన్ని పూర్తిగా మార్చేశారు. ఇకపై మీరు ఏదైనా సర్వీస్ కోసం ఆధార్ వివరాలు ఇవ్వాల్సి వస్తే, ఆ సర్వీస్‌కు ఎంత సమాచారం అవసరమో అంతే షేర్ అవుతుంది. మీ పూర్తి ప్రొఫైల్ అవతలి వారికి కనిపించదు. దీనివల్ల మీ పర్సనల్​ ఇన్ఫర్మేషన్​ చాలా సేఫ్‌గా ఉంటాయి.

ఫీచర్లు: ఈ కొత్త యాప్‌లో కొన్ని అదిరిపోయే ఫీచర్లు వచ్చాయి.

  • ఫేస్ అథెంటికేషన్: పాత యాప్​లో ఇప్పటివరకు కేవలం ఓటీపీ ద్వారానే లాగిన్ అయ్యేవాళ్లం. కానీ ఇప్పుడు ఫేస్​ స్కాన్ చేసి కూడా లాగిన్ అవ్వచ్చు.
  • క్యూఆర్​ కోడ్ షేరింగ్: హోటల్స్‌కు వెళ్లినప్పుడు లేదా ప్రభుత్వ ఆఫీసుల్లో వెరిఫికేషన్ కోసం మీ పూర్తి ఆధార్ కార్డ్ చూపించాల్సిన అవసరం లేదు. యాప్‌లో ఉండే క్యూఆర్ కోడ్ చూపిస్తే సరిపోతుంది.
  • బయోమెట్రిక్ లాక్: మీ ఫింగర్ ప్రింట్ లేదా కంటి గుర్తులను (Iris) మీరే సొంతంగా లాక్ చేసుకోవచ్చు.

కొత్త యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో మార్చగలిగే వివరాలు: ఈ కొత్త యాప్​ ద్వారా మొబైల్ నంబర్ అప్​డేట్​, అడ్రస్​ వివరాలు మార్చుకోవడం వంటివి ఈజీగా చేసుకోవచ్చు. అయితే పేరు, పుట్టిన తేదీ, జెండర్, బయోమెట్రిక్స్, కంటిపాప స్కాన్, ఫొటో వంటివి మార్చడానికి మాత్రం ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిందే.

కొత్త యాప్‌ను ఎలా సెటప్ చేసుకోవాలి?

  • మీ ఫోన్‌లోని గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుండి ఆధార్​ అఫీషియల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • డౌన్​లోడ్​ చేసిన యాప్​ను ఓపెన్​ చేయాలి. హోమ్​ పేజీలో Begin Journey ఆప్షన్​ ఉంటుంది. దానిపై క్లిక్​ చేసి Register బటన్​పై నొక్కాలి.
  • ఫస్ట్​ స్టెప్​లో మీ ఆధార్​ నెంబర్​ ఎంటర్​ చేసి వ్యాలీడేట్​ చేయాలి. అనంతరం సిమ్​ వెరిపికేషన్​ పూర్తి చేయాలి.
  • చివరగా ఫేస్​ అథెంటికేషన్​ పూర్తి చేయాలి. అంటే ఇక్కడ లైవ్​ ఫొటో ఉంటుంది.
  • అనంతరం 6 డిజిట్​ సెక్యూరిటీ పిన్​ సెట్​ చేసుకోవాలి. అంతే స్క్రీన్​ మీద వివరాలు కనిపిస్తాయి. Profile ఆప్షన్​లోకి వెళ్లి మీ ఫ్యామిలీ మెంబర్స్​ ఆధార్​ వివరాలు యాడ్​ చేసుకోవచ్చు.

ఇక గూగుల్ వాలెట్‌లోనే ఆధార్- ఫిజికల్ కార్డు అవసరం లేదు!

మీ ఆధార్​ కార్డులో తప్పులు ఉన్నాయా? - ఇంటి వద్ద నుంచే ఇలా మార్చుకోండి