ETV Bharat / offbeat

'గూగుల్ మ్యాప్' ఇలా వాడారంటే మీ టైం సేవ్ - ప్రయాణం మరింత సౌకర్యం!

టూర్ ప్లాన్ చేసే మ్యాప్స్ - మీ పని చేసి పెట్టే జైమినై ఏఐ!

google_map_updates_2026
google_map_updates_2026 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 6, 2026 at 5:15 PM IST

4 Min Read
Choose ETV Bharat

Google Map Updates 2026 : కొత్తగా ఏదైనా ప్రదేశానికి వెళ్తుంటే గూగుల్ మ్యాప్ ఉపయోగించడం సర్వ సాధారణం. లొకేషన్ షేర్ చేస్తే చాలు డెరెక్షన్ బటన్ క్లిక్ చేసి అక్కడికి బయల్దేరిపోతాం. కార్లు, బైకులు, కాలినడకన వివిధ మార్గాల్లో షార్ట్ కట్, దగ్గరి దారులను గూగుల్ మ్యాప్ చూపిస్తుంది. సుదూర ప్రాంతానికి వెళ్తున్నట్లయితే మార్గమధ్యంలో పెట్రోల్ బంకులు, హోటళ్లు, రెస్టారెంట్లు, టోల్ గేట్లు ఇలా అన్నింటినీ ముందస్తుగానే తెలుసుకుంటూ ప్రాయాణం ప్రారంభిస్తాం. ఈ నేపథ్యంలో "గూగుల్ మ్యాప్స్"ని పూర్తిస్థాయిలో ఎలా వాడాలో చాలా మందికి తెలియదు. ఇందులో ఉన్న ఫీచర్లు, అప్​డేట్స్ ఏంటో తెలుసా?

పిడుగుపాటును ముందే పసిగట్టే "యాప్స్" - మీ ఫోన్​లో ఉన్నాయా?

google_map_updates_2026
google_map_updates_2026 (ETV Bharat)

ఆస్క్‌ మ్యాప్స్‌

మీరు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తున్నట్లయితే ముందస్తుగానే టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. గూగుల్ మ్యాప్​ మీకు అన్ని విధాలుగా సాయపడుతుంది. ఉదాహరణకు "నేను ఆదివారం విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాలని అనుకుంటున్నా. దారిలో పెట్రోల్ ఎక్కడ పోయించాలి? లంచ్‌ ఎక్కడ బాగుంటుంది? దారిలో చూడదగ్గ ప్రదేశాలు ఏమేం ఉన్నాయి?" అని అడిగితే చాలు! వెంటనే 'జెమినై ఏఐ' ఆ దారి వెంట ఉండే హోటళ్లు, రెస్టారెంట్లు, బంకులు, సందర్శనీయ ప్రాంతాలకు సంబంధించిన రివ్యూలను పరిశీలించి సమాధానమిస్తుంది. ఈ క్రమంలో 30 కోట్ల ప్రాంతాలు, 50 కోట్ల కమ్యూనిటీ రివ్యూలను పరిశీలిస్తుంది. మనదేశంలో ఆస్క్ మ్యాప్ ఫీచర్‌ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్లందరికీ అందుబాటులో ఉంది. సెర్చ్‌ బార్‌ కింద ఉండే ఆస్క్‌ మ్యాప్స్‌ బటన్‌ మీద టచ్ చేసి మీకు తెలిసిన భాషలో ప్రశ్నను టైప్‌ చేస్తే సరిపోతుంది.

3డీ వ్యూలో దృశ్యాలు

గతంలో మ్యాప్ ద్వారా ప్రయాణిస్తున్న క్రమంలో నీలం రంగు బాణం గుర్తు దారి చూపించేది. కానీ, అది ఇపుడు పూర్తిగా మారిపోయింది. మ్యాప్స్‌ రూపొందించినప్పటి నుంచీ గూగుల్‌ తీసుకొచ్చిన అతిపెద్ద అప్‌డేట్‌ ఇదే కాగా, బాణం గుర్తుకు బదులు 3డీలో దృశ్యాలు కనిపిస్తాయి. ప్రయాణంలో దారితో పాటు భవనాలు, వంతెనలు, ట్రాఫిక్‌ లైట్లు, క్రాస్‌వాక్స్, లేన్‌ మార్కింగ్స్‌ వంటివన్నీ ఫొటోరియలిస్టిక్‌గా కనిపించడం విశేషం. సంక్లిష్ట ఫ్లైఓవర్లు, కూడళ్లు ఉన్న మనదేశంలో ఇదెంతో ఉపయుక్తం కాగా, భవనాలను పారదర్శకంగా చూపించటం ద్వారా వాటి వెనక ఉన్నవీ చూడొచ్చు. ఇందుకోసం నావిగేషన్‌ స్క్రీన్‌లో పైన కుడి మూలన ఉండే 3డీ గుర్తును టచ్ చేసి ఉంచాలి.

ఆటో అప్‌డేటెడ్‌ ఆఫ్‌లైన్‌ మ్యాప్స్‌

మీరు ఇంటర్నెట్​ అందుబాటులో లేని ప్రాంతంలో పర్యటించాల్సి వస్తే ముందుగానే మ్యాప్ డౌన్​లోడ్ చేసి పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఆఫ్‌లైన్‌లో కూడా వాడుకోవచ్చు. మీరు డౌన్‌లోడ్‌ చేసుకున్న మ్యాప్‌లు వై-ఫై పరిధిలోకి రాగానే వాటికవే రిఫ్రెష్‌ అయిపోతాయి. ఆఫ్‌లైన్‌ మ్యాప్‌లు సైతం ప్రస్తుతమున్న రోడ్డు, నిర్మాణ డేటానే తీసుకుంటాయి. ఈ అప్​డేట్ కోసం పట్టణం లేదా ప్రాంతాన్ని సెర్చ్‌ చేసి, డౌన్‌లోడ్‌ ఆప్షన్ మీద టచ్ చేస్తే చాలు.

నో బిఫోర్‌ యు గో సారాంశాలు

కొత్త ప్రదేశానికి టూర్ ప్లాన్ చేస్తున్నట్లయితే అక్కడి వసతులు, సౌకర్యాలు పరిశీలిస్తుంటాం. హోటళ్లు, రెస్టారెంట్ల విషయంలో యూజర్ల రివ్యూలను పరిశీలిస్తుంటాం. అందులో కొన్ని పేక్ రివ్యూలు కూడా ఉంటాయి. అందుకే అన్ని రివ్యూలను మీరు చదవాల్సిన పని లేకుండా వెతికి పెట్టడమే 'నో బిఫోర్‌ యు గో' సదుపాయం. ఇది యూజర్‌ రివ్యూల ఆధారంగా కచ్చితమైన ఏఐ జనరేటెడ్‌ సారాంశాన్ని మీకు అందిస్తుంది. ఎక్కువ మంది ఏ వంటకాలకు మంచి రివ్యూ ఇచ్చారు. ఏది బాగుంటుంది? ఏది బాగుండదు, ఎంత సేపు వేచి ఉండాల్సి వస్తుంది? పార్కింగ్‌ అందుబాటులో ఉందా? వంటివన్నీ తెలుస్తాయి. దీని కోసం మీరు ఎంచుకున్న రెస్టరెంట్, షాప్‌ సెర్చ్‌ చేసి వాటి జాబితా మీద పైకి స్క్రోల్‌ చేస్తే 'నో బిఫోర్‌ యు గో' విభాగం కనిపిస్తుంది.

లైవ్‌ వ్యూతో నడక

మీరు తెలియని ప్రాంతానికి వెళ్లినపుడు అక్కడి భవనాలు, ప్రాంతం వివరాలను తెలుసుకోవాలనుకుంటే 'లైవ్‌ వ్యూ' సాయపడుతుంది. కుడివైపు వెళ్లాలో లేక ఎడమవైపు వెళ్లాలో? ముందుకా, వెనక్కా? అనే విషయాలు తెలియనపుడు మ్యాప్స్‌లో వాకింగ్‌ మోడ్‌ ఎంచుకొని, ఎదురుగా ఉన్న వాటిపై ఫోన్‌ కెమెరా ఫోకస్‌ చేస్తే చాలు!. అప్పుడది ఆగ్మెంటెడ్‌ రియాల్టీ పరిజ్ఞానంతో వాకింగ్‌ బాణం గుర్తులను, వీధులు, దుకాణాల పేర్ల వంటి వాటిని ప్రత్యక్షంగా కెమెరా ఫీడ్‌లో చూపిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతానికి ముంబై, దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణె నగరాల్లో అందుబాటులో ఉంది. దీని కోసం లక్ష్యాన్ని సెర్చ్‌ చేసి 'డైరెక్షన్స్‌' ఎంచుకుని వాకింగ్‌ గుర్తు టచ్ చేసి లైవ్‌ వ్యూ బటన్‌ ప్రెస్ చేయాలి.

యాక్సెసబుల్‌ ప్రాంతాల గుర్తింపు

దివ్యాంగులు, వీల్‌ చైర్లను ఉపయోగించే వృద్ధుల కోసం యాక్సెసబుల్‌ ప్లేసెస్‌ ఫీచర్‌ బాగా ఉపయోగపడుతుంది. యాక్సెసబుల్‌ ప్లేసెస్‌ ఫీచర్‌ వీల్‌చైర్లు వెళ్లటానికి అనువైన ప్రవేశ ద్వారాలు, బాత్రూమ్‌లు, మెట్లు లేని దారులను చూపిస్తుంది. సెటింగ్స్‌ ద్వారా యాక్సెసబిలిటీలోకి వెళ్లి యాక్సెసబుల్‌ ప్లేసెస్‌ ఫీచర్‌ను ఆన్‌ చేస్తే సరిపోతుంది.

మెరిసేదంతా బంగారం కాదండీ! - ఆభరణాలు కొనేటప్పుడు ఈ టిప్స్​ పాటిస్తే బెస్ట్​!

హామీ లేకుండా "రూ.10 లక్షల ఎడ్యుకేషన్​ లోన్​" - విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం సూపర్​ ఆఫర్​!