ETV Bharat / offbeat

తెలంగాణ స్టైల్​లో నోరూరించే "టమాటా చారు" - ఒక్కసారి తింటే ఫేవరెట్ డిష్​గా మారడం పక్కా!

ఇంటిల్లిపాదీ మెచ్చే కమ్మని 'టమాటా రసం' - అప్పటికప్పుడు నిమిషాల్లోనే రెడీ!

Tomato Charu Recipe
Tomato Charu Recipe (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : November 13, 2025 at 4:05 PM IST

3 Min Read
Choose ETV Bharat

Tomato Charu Recipe in Telangana Style : మనలో చాలా మంది రొటీన్ కూరలు తిని బోరింగ్​గా అనిపించినప్పుడు రసం రెసిపీలను చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందులోనూ మెజార్టీ పీపుల్ చేసుకునే వాటిలో "టమాటా చారు" ముందు వరుసలో ఉంటుంది. దీన్ని ఒక్కొక్కరు ఒక్కో స్టైల్​లో రెడీ చేసుకుంటుంటారు. అయితే, ఓసారి ఎప్పుడు చేసుకునే రెగ్యులర్​ పద్ధతిలో కాకుండా తెలంగాణ స్టైల్​లో "టమాటా చారును" ట్రై చేసి చూడండి. టేస్ట్ భలే గొప్పగా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేసుకుని తిన్నారంటే మళ్లీ మళ్లీ ఇదే పద్ధతిని ఫాలో అవుతారు. పిల్లలు కూడా ఈ చారుతో రోజూ తినే దాని కంటే నాలుగు ముద్దలు ఎక్కువే లాగిస్తారు! పైగా ఈ రెసిపీ కోసం ఎక్కువ టైమ్ కూడా పట్టదు. మరి, ఈ సింపుల్ అండ్ టేస్టీ టమాటా చారును ఎలా చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

Tomato Charu Recipe
టమాటాలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • టమాటాలు - ఆరు
  • చింతపండు - రెండు చిన్న నిమ్మకాయలంత
  • తెల్ల నువ్వులు - నాలుగు టీస్పూన్లు
  • నూనె - నాలుగు టేబుల్​స్పూన్లు
  • బిర్యానీ ఆకులు - నాలుగు
  • మెంతులు - ఒక టీస్పూన్
  • జీలకర్ర - ఒక టీస్పూన్
  • ఆవాలు - ఒక టీస్పూన్
  • పచ్చిమిర్చి - నాలుగు
  • ఎండుమిర్చి - నాలుగు
  • ఉల్లిపాయలు - రెండు
  • వెల్లుల్లి పేస్ట్ - రెండు టీస్పూన్లు
  • కరివేపాకు - కొద్దిగా
  • పసుపు - అరటీస్పూన్
  • కారం - నాలుగు టీస్పూన్లు
  • ఉప్పు - టేస్ట్​కి సరిపడా
  • ధనియాల పొడి - రెండు టీస్పూన్లు
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

అన్నం మిగిలిపోయిందా? - ఇలా "కట్​లెట్స్" చేయండి! - డీప్ ఫ్రై అవసరం లేదు!

Tomato Charu Recipe
నువ్వులు (Getty Images)

తయారీ విధానం :

  • తెలంగాణ స్టైల్​లో నోరూరించే ఈ చారు తయారీ కోసం ముందుగా టమాటాలను శుభ్రంగా కడగాలి.
  • అనంతరం కుక్కర్ గిన్నె తీసుకుని అందులో టమాటాలను రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే, చింతపండును శుభ్రంగా కడిగి వేసి, రెండు గ్లాసుల నీళ్లు యాడ్ చేసుకుని కలిపి మూతపెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
  • టమాటాలు ఉడికేలోపు స్టవ్ మరో బర్నర్ మీద చిన్న కడాయిలో తెల్ల నువ్వులు వేసుకుని సన్నని మంటపై దోరగా వేయించుకోవాలి.
  • అలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్​లోకి తీసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకుని పక్కనుంచాలి.
Tomato Charu Recipe
చింతపండు (Getty Images)
  • ఇప్పుడు మెత్తగా ఉడికిన టమాటా మిశ్రమాన్ని కుక్కర్​లోని ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి అందులోని వాటర్​ను మరో గిన్నెలోకి స్టెయినర్​(జాలిగరిటె)తో వడకట్టి తీసుకోవాలి.
  • తర్వాత స్టెయినర్​లో మిగిలిన టమాటా చింతపండు మిశ్రమాన్ని మిక్సీ జార్​లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
  • అనంతరం మిక్సీ పట్టుకున్న టమాటా గుజ్జును వడకట్టుకున్న వాటర్​లోకి స్టెయినర్​లో వేసి ఫిల్టర్​ చేసి తీసుకోవాలి. చివరగా స్టెయినర్​లో మిగిలిపోయిన టమాటా పొట్టు, గింజలను బయటపడేయాలి. ఆవిధంగా టమాటా ప్యూరీని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ మీద టమాటా చారు కోసం కడాయి లేదా పాన్ పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి.

అమ్మమ్మల పద్ధతిలో "వెల్లుల్లి రసం" - చల్లని వేళ వేడివేడి అన్నంలో అద్భుతమే!

Tomato Charu Recipe
మసాలా దినుసులు (Getty Images)
  • ఆయిల్ వేడయ్యాక బిర్యానీ ఆకులు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. అవి కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిర్చి తుంపలు, నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.
  • తర్వాత వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు మంచిగా ఫ్రై అయ్యాక పసుపు వేసి కలపాలి.
  • అనంతరం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఆపై మీరు తినే పులుపును బట్టి, చారుకు కన్సిస్టెన్సీకి కావాల్సినన్ని నీళ్లు పోసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
Tomato Charu Recipe
ఉల్లిపాయ ముక్కలు (Getty Images)
  • మిశ్రమం మొత్తాన్ని మంచిగా కలిపిన తర్వాత అందులో రుచికి తగినంత కారం, ఉప్పు వేసుకుని కలిపి ఐదారు నిమిషాల పాటు మరిగించుకోవాలి.
  • ఆ తర్వాత చారు కాస్త చిక్కగా అవ్వడానికి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని నాలుగు టీస్పూన్ల వరకు వేసుకుని కలిపి మరో మూడు నిమిషాలు మరిగించాలి.
  • మూడు నిమిషాల పాటు మరిగించాక చివరగా ధనియాలపొడి, సన్నని కొత్తిమీర తరుగు వేసుకుని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు.
  • అంతే, తెలంగాణ స్టైల్​లో సూపర్ టేస్టీగా ఘుమఘుమలాడే "టమాటా చారు" అప్పటికప్పుడు రెడీ అవుతుంది!
Tomato Charu Recipe
కొత్తిమీర (Getty Images)

బెల్లంతో జ్యూసీ జ్యూసీగా "ఉసిరికాయ మురబ్బా" - తయారీ చాలా సింపుల్, ఏడాది నిల్వ!