ETV Bharat / offbeat

టమోటాలు ఎండబెట్టకుండానే - అప్పటికప్పుడు చేసుకునే నిల్వ పచ్చడి!

అరకేజీ టమోటా పచ్చడిలోకి పక్కా కొలతలివే - 3నెలలు టేస్టీగా తినేయొచ్చు!

tomato_chutney
tomato_chutney (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 19, 2026 at 10:37 AM IST

2 Min Read
Choose ETV Bharat

Tomato Chutney : కర్రీలు ఏమీ లేనపుడు ఊరగాయ పచ్చళ్లతో కమ్మగా కడుపునిండా తినేయొచ్చు. ఆ జాబితాలో ముఖ్యంగా గోంగూర పచ్చడి, టమోటా పచ్చడి, ఆవకాయ పచ్చడి ఉంటాయి. అయితే, టమోటా పచ్చడి అప్పటికప్పుడు ఈజీగా పెట్టేయొచ్చు. ఎవరి సహకారం అవసరం లేకుండానే కర్రీ చేసినంత ఈజీగా చట్నీ చేసి పెట్టొచ్చు. ఇలా చేసే చట్నీ 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిజ్​లో పెట్టుకుంటే ఆరు నెలలైనా తినేయొచ్చు కానీ, అర కేజీ పచ్చడి 10రోజుల్లోనే తినేస్తుంటారు. ఇక్కడ ఇచ్చిన పదార్థాలు, పక్కా కొలతల్లో సింపుల్​గా ట్రై చేసి చూడండి.

ఇడ్లీ, దోసెల్లోకి "ఘీ కారం పొడి" - కమ్మగా, కారంగా అద్భుతంగా ఉంటుంది!

tomato_chutney
tomato_chutney (Getty images)

కావాల్సిన పదార్థాలు :

  • పండు టమోటాలు - అరకేజీ
  • చింతపండు - 60 గ్రాములు
  • కారం - 50 గ్రాములు
  • ఉప్పు - 50 గ్రాములు
  • వెల్లుల్లి - 50 గ్రాములు
  • పసుపు - 1 టీ స్పూన్
  • మెంతులు - 2 టీ స్పూన్లు
  • ఆవాలు - 1 టీ స్పూన్
  • నూనె - 200 గ్రాములు
  • ఆవాలు - 1 స్పూన్
  • మినప్పప్పు - 1 స్పూన్
  • శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
  • జీలకర్ర - 1 స్పూన్
  • ఎండు మిర్చి - 5
  • వెల్లుల్లి - 12
  • కరివేపాకు - 2 రెమ్మలు
tomato_chutney
tomato_chutney (Getty images)

తయారీ విధానం :

  • ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 టీ స్పూన్ల మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని సన్నటి మంటపై వేయించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీలోకి తీసుకుని మెత్తని పొడి చేసుకుని తీసుకోవాలి.
tomato_chutney
tomato_chutney (ETV Bharat)
  • ఇపుడు అరకేజీ పండు టమోటాలను శుభ్రం చేసుకుని తడి లేకుండా క్లాత్​తో క్లీన్ చేసుకోవాలి. ఓ ప్లేట్ తీసుకుని టమోటాలను మధ్య తొడిమ భాగం తీసేసుకుని ముక్కలు కట్ చేసుకోవాలి. ఆ తర్వాత 60 గ్రాముల తాజా చింతపండును గింజలు, చెత్త లేకుండా తీసుకోవాలి. టమోటా ముక్కలతో పాటు చింతపండును మిక్సీ జార్​లోకి తీసుకోవాలి. రెండు, మూడు పల్స్ ఇచ్చిన తర్వాత 50 గ్రాముల కారం, 50 గ్రాముల ఉప్పు, 50 గ్రాముల వెల్లుల్లి, 1 టీ స్పూన్ పసుపు వేసుకుని మరో సారి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
tomato_chutney
tomato_chutney (Getty images)
  • ఇపుడు ప్యాన్​లో అర కేజీ టమోటాలకు పావు కేజీ వరకు పల్లీ నూనె వేసుకుని పోపు దినుసులు వేయించాలి. ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండు మిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకుని దోరగా వేయించాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న టమోటా పేస్ట్ వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్​లో బాగా కలుపుతూ ఉడికించాలి. టమోటాలు ఎండబెట్టకుండా చేసే పచ్చడి కాబట్టి కాస్త నూనెలో మగ్గించాలి.
tomato_chutney
tomato_chutney (Getty images)
  • ముందుగా పచ్చడి నూనె మొత్తం పీల్చుకుని 15 నిమిషాల తర్వాత వదిలేస్తుంది. మరో 5 నిమిషాల తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆవాలు, మెంతుల పొడి వేసుకుని బాగా కలిపి మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇపుడు స్టవ్ కట్టేసి పచ్చడి చల్లారిన తర్వాత ఒక రోజంతా అలాగే ఉంచి మర్నాడు గాజు సీసాలోకి తీసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీ దాదాపు 3నెలలకు పైగానే నిల్వ ఉంటుంది.

నోటికి కొత్త రుచినిచ్చే "టమోటా మెంతి సోయా కర్రీ" - కొత్తవాళ్లైనా ఇలా సింపుల్​గా చేసేయొచ్చు!

ఘుమఘుమలాడే "మెంతికూర పచ్చడి" - కమ్మగా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది!