కిటికీ మూలలు క్లీన్ చేయడం కష్టంగా ఉందా? - ఈ టిప్స్‌తో ప్రాబ్లమ్ సాల్వ్ - నీట్‌గా ఉంటాయి!
-మరికొన్ని రోజుల్లో ఉగాది, శ్రీరామనవమి పండుగలు - ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అయిపోండి!

Published : March 2, 2026 at 4:55 PM IST
|Updated : March 2, 2026 at 5:11 PM IST
Tips to Clean Window Corners: నార్మల్ రోజుల్లో ఎలా ఉన్నా పండగ వస్తుందంటే చాలు ఇంటిని డీప్ క్లీన్ చేస్తుంటారు మహిళామణులు. కిచెన్, హాల్, బెడ్రూమ్ అంటూ ప్రతి మూల శుభ్రం చేస్తుంటారు. అయితే అన్నీ బాగానే క్లీన్ చేసినా.. కిటికీ మూలలు, స్లైడ్ ట్రాక్స్‌ని క్లీన్ చేయాలంటే మాత్రం విసుగు వస్తుంది. ఇల్లంతా క్లీన్ చేయడం ఒకఎత్తైతే.. కిటికీలు క్లీన్ చేయడం మరోటి. కారణం అక్కడ ఉన్న దుమ్ము, ధూళి, పురుగులను తొలగించడానికి చాలానే కష్టపడాలి. కానీ మీకు తెలుసా? కిటికీ మూలల్ని/ట్రాక్స్‌ని సులభంగా శుభ్రం చేసేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఎలాగో మరికొన్ని ఉగాది, శ్రీరామనవమి వంటి పండుగలు వస్తున్నాయి కాబట్టి.. ఈసారి క్లీన్ చేసేటప్పుడు వీటిని ఫాలో అయితే సరి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
బేకింగ్ సోడా + వెనిగర్: మురికితో జిడ్డుగా మారిన కిటికీ మూలల్ని బేకింగ్ సోడా, వెనిగర్‌తో సులభంగా శుభ్రం చేయచ్చని నిపుణులు అంటున్నారు. వీటిని వాడటం వల్ల మురికి పోవడంతో పాటు దుర్వాసన ఉన్నా తొలగిపోతుందని చెబుతున్నారు. ఎలా క్లీన్ చేయాలంటే.. ముందుగా కిటికీ మూలల్లో బేకింగ్ సోడా, వెనిగర్‌ను ఒకదాని తర్వాత ఒకటి చల్లాలి. పది నిమిషాలు అలాగే వదిలేసి.. ఆ తర్వాత టూత్‌బ్రష్‌తో నెమ్మదిగా రుద్ది, పొడి పేపర్ టవల్‌తో తుడిచేస్తే సరిపోతుందని చెబుతున్నారు.
ఇక స్లైడ్ ట్రాక్స్ ఉన్న వారు కూడా అందులో పేరుకుపోయిన మురికిని తొలగించడానికి పైన చెప్పిన బేకింగ్ సోడా, వెనిగర్‌ను యూజ్ చేయవచ్చని వివరిస్తున్నారు. అందుకోసం ముందులానే వెనిగర్, బేకింగ్ సోడా చల్లి టూత్‌బ్రష్‌తో నీట్‌గా రుద్దాలి. ఆపై తడి గుడ్డతో ఆ ట్రాక్స్‌లోని మురికిని తుడిచేస్తే కొత్తవాటిలా ఉంటాయని అంటున్నారు. ఇక ట్రాక్ మధ్య గ్యాప్ సన్నగా ఉంటే.. ప్లాస్టిక్ నైఫ్‌కు ఒక క్లాత్ చుట్టి.. దుమ్మును తొలగించచ్చని చెబుతున్నారు.
నిమ్మ నూనె: కిటికీ మూలల్లోని దుమ్మును తొలగించాలన్నా, కిటికీ గ్లాసులపై మురికిని పోగొట్టాలన్నా నిమ్మ నూనె చక్కగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే నిమ్మ నూనె, వైట్ వెనిగర్‌ను సమపాళ్లలో తీసుకోవాలి. ఓ క్లాత్‌ను ఈ లిక్విడ్‌లో ముంచి కిటికీ మూలల్ని, గ్లాసుల్ని, స్లైడ్ ట్రాక్స్‌ని తుడిచేస్తే.. అక్కడి దుమ్ము, జిడ్డుదనం తొలగిపోతుందని చెబుతున్నారు.
స్పాంజ్‌లు: చేతి వేళ్లు చేరుకోలేని మూలలు, కిటికీ స్లైడ్ ట్రాక్స్‌ను స్పాంజ్‌తో సులభంగా శుభ్రం చేయచ్చని చెబుతున్నారు. ఇందుకోసం ఏదైనా క్లీనింగ్ ద్రావణాన్ని స్లైడ్ ట్రాక్స్‌పై పోసి కాసేపు నాననివ్వాలి. ఇప్పుడు చిన్న స్పాంజి ముక్క లేదంటే మైక్రోఫైబర్ క్లాత్‌ను తీసుకుని ట్రాక్ కింద ఉంచి ముందుకి, వెనక్కి జరపాలి. ఫలితంగా దుమ్ము, మురికితో పాటు క్లీనింగ్ ద్రావణాన్నీ స్పాంజ్ పీల్చేస్తుందని.. తద్వారా కిటికీ ట్రాక్స్ తళతళలాడతాయని వివరిస్తున్నారు. ఇక కిటికీ మూలల వద్ద కూడా క్లీనింగ్ ద్రావణాన్ని పూసి.. స్పాంజ్ ఎడ్జ్‌తో రుద్దుతూ శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు.
ప్రత్యేకమైన బ్రష్‌లు: కిటికీ మూలలు, స్లైడ్ ట్రాక్స్‌పై పేరుకున్న దుమ్మును సులభంగా వదిలించడానికి ప్రస్తుతం మార్కెట్లో ప్రత్యేకమైన బ్రష్‌లు దొరుకుతున్నాయి. ఎల్-షేప్, కర్వీ మూలలు, ఫ్లెక్సిబుల్‌గా కదిలేవి, రెండు వైపులా బ్రిజిల్స్ ఉన్నవి.. ఇలా అవసరాన్ని బట్టి వీటిని ఉపయోగించుకోవచ్చు. కిటికీ మూలలు, స్లైడ్ ట్రాక్స్‌పై క్లీనింగ్ ద్రావణాన్ని పోసి.. ఈ బ్రష్‌ల సహాయంతో సులభంగా క్లీన్ చేసుకోవచ్చని చెబుతున్నారు.
బ్లాక్ టీ : బ్లాక్ టీతో కూడా కిటికీ మూలలను శుభ్రం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ట్యానిక్ ఆమ్లం క్లీనింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుందని వివరిస్తున్నారు. ఇందుకోసం కొద్దిగా బ్లాక్ టీని గిన్నెలోకి తీసుకొని.. అందులో కొద్దిగా డిష్‌వాషింగ్ లిక్విడ్ వేయాలి. ఈ మిశ్రమాన్ని కిటికీ మూలలు, స్లైడ్ ట్రాక్స్‌పై అప్లై చేసి 15 నిమిషాలు అలా వదిలేయాలి. తర్వాత పొడి గుడ్డతో తుడిచేస్తే సరిపోతుందని చెబుతున్నారు.
రైలులో మీ సీట్లో మరొకరు కూర్చున్నారా? - గొడవక్కర్లేదు ఈ "నంబర్‌కు" మెసేజ్ పెడితే చాలు!
ఇంటర్నెట్ లేకపోయినా "గూగుల్ మ్యాప్స్" యూజ్ చేయొచ్చు! - జస్ట్ ఈ ట్రిక్ తెలిస్తే చాలు!

