రెస్టారెంట్ స్టైల్ 'మేతి చమన్' - రంగు, రుచి కోసం చెఫ్‌ల మేకింగ్ స్టైల్ ఇదే!
రెస్టారెంట్ స్టైల్ మెంతి చమన్ రెసిపీ - ఇంట్లోనే క్రీమీగా ఉండే పనీర్ మెంతి కూర!

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 1, 2026 at 7:44 PM IST
Restaurant Style Methi Chaman : మేతి చమన్ కర్రీ అనగానే పుల్కా, పరోటా గుర్తొస్తుంది. పరోటా రెడీగా ఉందంటే మేతి చమన్ కర్రీ ఉంటే బాగుండు! అనిపిస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్ అద్భుతంగా, టేస్టీగా, తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. మెంతి కూర కమ్మదనం, మెత్తని పనీర్ నోరూరిస్తుంది. ఇలాంటి రెస్టారెంట్ స్టైల్ మేతి చమన్ కర్రీ ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవాలంటే ఈ పద్ధతులు ఫాలో అయితే సరిపోతుంది.
రెస్టారెంట్లో మెంతికూర చేదు పోవడానికి మెంతి ఆకులను ఉప్పు వేసిన నీటిలో మరిగిస్తారు. లేదా 2 నిమిషాలు ఉడికించడం వల్ల చేదు పూర్తిగా పోతుంది. పచ్చి మెంతి ఆకులు వంటకం రుచిని మార్చేస్తాయి కాబట్టి ఈ దశ చాలా కీలకం.
దేశ వ్యాప్తంగా 'బైగన్ బాద్షా' - "ఆహా ఏమిరుచి" అంటున్న పంజాబీలు!
- వంటకానికి మరింత రుచి, చిక్కదనం, కమ్మగా ఉండడానికి కొంత మంది చెఫ్‌లో క్రీమ్ వాడుతుంటారు. కానీ, క్రీమ్ బదులు జీడిపప్పు పేస్ట్ వేశారంటే అద్భుతంగా ఉంటుంది. 10-12 జీడిపప్పులను నీళ్లలో పావుగంట సేపు నానబెట్టి ఆ తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి కలిపితే సరిపోతుంది.
- రంగు, రుచి, స్పైసీ కోసం కశ్మీరీ చిల్లీ పౌడర్ బాగుంటుంది. ఇది మరీ ఘాటుగా కాకుండా టేస్టీగా ఉంటుంది. పైగా కర్రీ రంగు చూడడానికి బాగుంటుంది.
- 2 కప్పుల తాజా మెంతి ఆకులు సన్నగా కట్ చేసుకోవాలి. పనీర్ ముక్కలను ఓ ప్యాన్‌లో నెయ్యి వేసుకుని బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కకు పెట్టుకోవాలి. పనీర్ ముక్కలు రబ్బరు మాదిరిగా గట్టిపడకుండా గోరువెచ్చని నీటిలో నానబెడితే సరిపోతుంది. ఇంట్లో స్వయంగా తయారు చేసిన పనీర్ రుచి బాగుంటుంది. 1 స్పూన్ కశ్మీరీ కారం పొడి, గరం మసాలా, కసూరి మేతి, కుంకుమ పువ్వు నీళ్లు వాడుకోవచ్చు.
- ముందుగా పోపు దినుసులు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఆ తర్వాత మెంతి ఆకులు, సన్నగా తరిగిన ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇపుడు తాజా అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసుకుని సన్నటి మంటపై నూనె తేలే వరకు వేయించాలి. ఆ తర్వాత టొమాటో ప్యూరీ కూడా వేసి కలపాలి. మరో ఐదు నిమిషాల పాటు సన్నటి మంటపై ఉడికించుకోవాలి. ఆ తర్వాత కారం, జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. చివరగా వేయించిన పనీర్ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టి మరో మూడు నిమిషాలు ఉడికించుకోవాలి.
- పనీర్ వేయించిన తర్వాత గోరువెచ్చని నీటిలో 5 నిమిషాలు నానబెట్టడం వల్ల అది చాలా మృదువుగా ఉంటుంది. గ్రేవీ బాగా పట్టడానికి పనీర్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి కలపాలి. ఈ పనీర్ కర్రీ పుల్కా, పరాటా, అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది.
వేడి వేడి అన్నంలోకి కమ్మని "బీరకాయ కొత్తిమీర పచ్చడి" - ఒక్కసారి తింటే టేస్ట్‌కు ఫిదా!
నూనెలో వేయించకుండానే టేస్టీ "పూరీలు"! - మూడు పద్దతుల్లో ఈజీగా చేసుకోండిలా!

