ETV Bharat / offbeat

షూస్ తడిచిపోయాయా? - ఇలా చేస్తే త్వరగా ఆరిపోతాయ్!

-వర్షాకాలంలో తడిచిన షూస్​తో ఇబ్బందిపడుతున్నారా? - ఇంట్లోని ఈ వస్తువులు యూజ్​ చేస్తే సమస్య సాల్వ్​ అంటున్న నిపుణులు!

Tips for Drying Wet Shoes
Tips for Drying Wet Shoes (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : July 8, 2026 at 5:21 PM IST

3 Min Read
Choose ETV Bharat

Tips for Drying Wet Shoes: వర్షం లేదా మరేదైనా కారణం చేత షూస్ తడిచిపోతుంటాయి. ఇక తడిచిన షూస్​ తోటి బయటికి వెళ్లడం అంటే సాహసమనే చెప్పుకోవాలి. ఇలాంటప్పుడే వాటిని పొడిగా చేసేందుకు జనాలు ఎన్నో తంటాలు పడుతుంటారు. ఎండలో ఆరబెట్టడం దగ్గర్నుంచి, హెయిర్ డ్రయ్యర్ ప్రయోగం వరకు ఏవేవో చేస్తుంటారు. కానీ ఫలితం ఉండదు. అయితే, ఇంట్లో లభించే సింపుల్ వస్తువులతో చాలా త్వరగా బూట్లను ఆరబెట్టుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాగా అదే సమయంలో కొన్ని పనులు అస్సలే చేయకూడదని, వీటివల్ల విలువైన షూస్ త్వరగా దెబ్బతింటాయంటున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

సాక్స్ స్క్వీజ్ టెక్నిక్: తడిచిన షూస్‌ను ఆరబెట్టడానికి చాలా మంది న్యూస్​పేపర్​ను ఫోల్డ్​ చేసి పెడుతుంటారు. అయితే న్యూస్‌పేపర్ పెట్టడం కంటే పొడి సాక్స్ పెట్టడం చాలా బెటర్ అంటున్నారు నిపుణులు. సాక్స్​లు షూ లోపలి ఆకారానికి పర్ఫెక్ట్‌గా ఉండి నీటిని త్వరగా పీల్చుకుంటాయని వివరిస్తున్నారు. పైగా సాక్స్​ల వల్ల సిరా మరకలు అంటవని చెబుతున్నారు.

ఇన్సోల్స్ తీసేయండి: షూస్​ తడవగానే చాలా మంది అలానే నేరుగా ఆరబెడుతుంటారు. కానీ ఇలా చేయకూడదని చెబుతున్నారు నిపుణులు. షూస్ లోపల ఉండే అడుగు భాగం ఇన్సోల్స్, లేసెస్ వెంటనే తీసేయాలని సూచిస్తున్నారు. వేళ్ల భాగంలో, ఇన్సోల్ కింద దాక్కునే నీటి వల్ల షూస్​ తొందరగా ఆరవని, పైగా బ్యాక్టీరియా చేరి బ్యాడ్​ స్మెల్​ వస్తాయని వివరిస్తున్నారు.

టవల్ ప్రెస్: తడిచిన వెంటనే షూస్‌ని గట్టిగా పిండి ఆరబెడుతుంటారు మెజార్టీ పీపుల్​. కానీ ఇలా చేయకూడదని, దీని వల్ల షూస్​ షేప్​ పాడవుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఒక పొడి టవల్‌తో బూట్ల చుట్టు పక్కలను లైట్‌గా ప్రెస్ చేస్తే ఎక్స్‌ట్రా వాటర్ వచ్చేస్తుందని, దీంతో తొందరగా ఆరిపోతుందని వివరిస్తున్నారు.

స్టడీ డెస్క్ ఫ్యాన్: టేబుల్​ ఫ్యాన్​ను ఉపయోగించి కూడా తడిచిన షూస్​ను ఆరబెట్టుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం టేబుల్ ఫ్యాన్‌ను షూస్​లో కాళ్లు పెట్టే భాగం వైపు తిప్పి గాలి నేరుగా లోపలికి వెళ్లేలా సెట్​ చేసుకుంటే.. నార్మల్ గాలికి ఆరేదానికంటే ఈ పద్ధతి చాలా స్పీడ్‌గా పనిచేస్తుందని అంటున్నారు.

రైస్ బ్యాగ్ ట్రిక్: సిలికా జెల్ ప్యాకెట్ల కంటే మన ఇంట్లో ఉండే బియ్యం తేమను అద్భుతంగా పీల్చుకుంటుందని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలోనే ఒక పాత సాక్స్‌లో కాస్త బియ్యం నింపి, దానిని షూ లోపల రాత్రంతా ఉంచితే తేమ మొత్తం మాయమవుతుందని వివరిస్తున్నారు.

హెయిర్​ డ్రయ్యర్​: జుట్టును ఆరబెట్టుకోవడానికి యూజ్​ చేసే హెయిర్​ డ్రయ్యర్​తో తడిచిన షూస్​ను ఆరబెట్టొచ్చని చెబుతున్నారు. ఇందులో భాగంగానే షూస్‌ని ఒక పొడి టవల్‌లో చుట్టి, హెయిర్ డ్రయ్యర్‌తో తక్కువ హీట్ మీద 2 నుంచి 3 నిమిషాల పాటు హీట్​ చేసుకోవాలట. ఇలా చేయడం వల్ల షూ మెటీరియల్ పాడవకుండా వేడి లోపలికి వెళ్లి నీరు ఆవిరవుతుందని చెబుతున్నారు.

వైర్​ హ్యాంగర్​: బట్టలు తగిలించే వైర్ హ్యాంగర్‌తో కూడా షూస్​ను ఆరబెట్టుకోవచ్చట. అందుకు ముందుగా వైర్​ హ్యాంగర్​ను కిందికి వంచి, షూస్‌ను బోర్లా వేలాడదీస్తే.. లోపల గాలి బాగా ఆడి, నీరు ఒకేచోట చేరకుండా ఉంటుందని, త్వరగా ఆరిపోతుందని చెబుతున్నారు. ఇక షూస్ ఆరిన తర్వాత వచ్చే బ్యాడ్ స్మెల్‌ను పోగొట్టడానికి వాడేసిన లేదా కొత్త టీ బ్యాగ్స్‌ యూజ్​ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు వాటిని రాత్రంతా షూస్ లోపల ఉంచితే, టీ లో ఉండే 'టానిన్లు' దుర్వాసనను దూరం చేస్తాయని చెబుతున్నారు.

అస్సలు చేయకూడని తప్పులు:

  • తడిచిన షూస్​ను చాలా మంది ఎండలో ఆరబెడుతుంటారు. కానీ ఇలా చేయడం వల్ల షూస్ గమ్ ఊడిపోయి, కలర్ వెలిసిపోతుందని అంటున్నారు. అందుకే నీడలోనే ఆరనివ్వాలని చెబుతున్నారు.
  • లెదర్ లేదా రబ్బర్ షూస్‌ను హీటర్ల పక్కన పెడితే అవి ముడుచుకుపోయి, బూట్లు డ్యామేజ్​ అవుతాయని వివరిస్తున్నారు.
  • షూస్ త్వరగా ఆరాలని లేదా షేప్ కోసం లావుపాటి వస్తువులను లోపల ఇరికించొద్దని చెబుతున్నారు. దీనివల్ల షూస్ సాగిపోయి లూజ్ అవుతాయని నిపుణులు అంటున్నారు.

మీ షూస్ నుంచి దుర్వాసన వస్తోందా? - ఇలా చెక్ పెట్టండి!

అదే పనిగా చెప్పులు, షూలు వేసుకుంటున్నారా? - ఈ సమస్యలు ఎటాక్​ చేసే ఛాన్స్​!