ETV Bharat / offbeat

పక్కా కొలతలతో "దొండకాయ పచ్చడి" - గ్రైండ్ చేయకుండా మక్కలు కలపడమే!

సింపుల్​గా చేసుకునే దొండకాయ పచ్చడి - వేడివేడి అన్నంలో వేసి తింటే రుచి మైమరచి పోవాల్సిందే!

Dondakaya Nilva Pachadi
Dondakaya Nilva Pachadi (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 9, 2026 at 2:22 PM IST

2 Min Read
Choose ETV Bharat

Dondakaya Nilva Pachadi in Telugu : దొండకాయతో కర్రీలు, వేపుళ్లు తయారు చేస్తుంటారు. ఇవే కాకుండా మీకోసం మరో రెసిపీ ఎదురు చూస్తుంది. అదే దొండకాయ నిల్వ పచ్చడి. ఈ పద్ధతిలో చేశారంటే పుల్లపుల్లగా కారం కారంగా వస్తుంది. చాలా తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు తయారవుతుంది. బిగినర్స్ కూడా ఈ స్టెప్స్ పాటిస్తూ నిమిషాల్లోనే చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి, కొద్దిగా నెయ్యి వేసి తింటే సూపర్ అనాల్సిందే. అంతేకాక రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది! మరి ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలి? ఇందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందామా?

"రేపు రథసప్తమి" - పాలు విరిగిపోకుండా ఇలాంటి "పరమాన్నం" చేసి పెట్టండి!

Dondakaya Nilva Pachadi
దొండకాయలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • దొండకాయలు - అర కిలో (500 గ్రాములు)
  • కారం - పావు కప్పు
  • ఆవపిండి - పావు కప్పు
  • పసుపు - ఒక స్పూన్
  • ఉప్పు - పావు కప్పు
  • మెంతిపిండి - 1 టీ స్పూన్
  • నిమ్మరసం - 3 టేబుల్ స్పూన్లు
  • ఆయిల్ - అర కప్పు
  • ఎండుమిర్చి - 4
  • తాలింపు దినుసులు - 1 టేబుల్​ స్పూన్
  • ఇంగువ - 2 చిటికెడ్లు
Dondakaya Nilva Pachadi
ఎండుమిర్చి (Getty Images)

తయారీ విధానం :

  • ముందుగా అర కిలో దొండకాయలను శుభ్రంగా కడిగి క్లాత్​తో తుడిచి ఆరబెట్టాలి. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, ఒక స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ మెంతిపిండి వేయాలి. అలాగే పావు కప్పు ఆవపిండి, పావు కప్పు ఉప్పు, పావు కప్పు కారం, మూడు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి మిక్స్ చేయాలి.
Dondakaya Nilva Pachadi
కారం (Getty Images)
  • ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలో అర కప్పు ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత నాలుగు ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు వేసి వేయించాలి. ఇందులో రెండు చిటికెడ్ల ఇంగువ వేసి కలపాలి. అనంతరం స్టవ్ ఆఫ్ చేసి తాలింపును చల్లారనివ్వాలి.
  • చల్లారిన తాలింపును దొండకాయ మిశ్రమంలో వేసి కలపాలి. ఆ తర్వాత పచ్చడిని ఎయిర్​టైట్ జార్​లోకి తీసుకుని రెండు రోజుల పాటు అలాగే వదిలేయాలి.
Dondakaya Nilva Pachadi
నిమ్మరసం (Getty Images)
  • అంతే దొండకాయ నిల్వ పచ్చడి సిద్ధంగా ఉంటుంది!
  • ఈ పద్ధతిని పాటిస్తూ చేశారంటే రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది!
Dondakaya Nilva Pachadi
ఉప్పు (Getty Images)
  • వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కాస్త నెయ్యి వేసి తిన్నారంటే ఎన్నడూ తినని టేస్ట్​ని ఎంజాయ్ చేస్తారు.
  • ఈ పచ్చడిని మీరు ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే దొండకాయతో పాటు ఇతర పదార్థాలను పెంచి తీసుకోవాలి.

స్వీట్ షాప్ స్టైల్ "బాదుషాలు" - కమ్మగా, నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి!

ఘుమఘుమలాడే "గోరు చిక్కుడు కొబ్బరి కర్రీ" - చపాతీ, రైస్​లోకి టేస్ట్ అద్దిరిపోతుంది!