ETV Bharat / offbeat

టిఫిన్ సెంటర్ స్టైల్ "చట్నీ" - ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా!

నిమిషాల్లో తయారయ్యే చట్నీ రెసిపీ - ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

Tiffin Center Style Chutney
Tiffin Center Style Chutney (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 15, 2026 at 1:52 PM IST

2 Min Read
Choose ETV Bharat

Tiffin Center Style Chutney : సాధారణంగా టిఫిన్ సెంటర్స్ లేదా రోడ్ సైడ్ బండ్ల మీద ఇడ్లీ, దోసె తినే ఉంటారు. అయితే ఇందులోకి ఇచ్చే పల్చటి చట్నీ సూపర్​గా ఉంటుంది. ఇది నోటికి కొత్త రుచినిస్తూ తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కొందరు ఇంట్లో కూడా దీనిని ప్రిపేర్ చేస్తారు. కానీ ఆ స్టైల్లో రావడం లేదని చెబుతుంటారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే స్టెప్స్ పాటిస్తూ ఈ చట్నీని చేశారంటే అచ్చం బయట తిన్నట్టుగానే వస్తుంది. ఇది వేడివేడి దోసెలు, ఇడ్లీలే కాకుండా, వడలు, పొంగనాలకు కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్. మరి ఇక ఆలస్యం చేయకుండా సింపుల్​గా ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా?

"పాలకూర పచ్చి బఠానీ కర్రీ" - ఇదొక్కటి చాలు పూరీ, రైస్​లో పర్ఫెక్ట్​గా ఉంటుంది!

Tiffin Center Style Chutney
పల్లీలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • పల్లీలు - ఒక కప్పు
  • ఆయిల్ - 2 టీ స్పూన్లు
  • మినపప్పు - 1 టేబుల్ స్పూన్
  • శనగపప్పు - 1 టీ స్పూన్
  • ఇంగువ - పావు టీ స్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు - 4
  • అల్లం - కొద్దిగా
  • ఉల్లిపాయలు - 1
  • కరివేపాకు - కొంచెం
  • ఎండుమిర్చి - 7
  • చింతపండు - కొద్దిగా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఆవాలు - అర టీ స్పూన్
Tiffin Center Style Chutney
ఎండుమిర్చి (Getty Images)

తయారీ విధానం :

  • ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్​లో కప్పు పల్లీలు వేయాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్​లో ఉంచి పల్లీలను వేయించి ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇదే పాన్​లో ఒక టీ స్పూన్ ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక టీ స్పూన్ శనగపప్పు, పావు టీ స్పూన్ ఇంగువ వేయాలి. అలాగే నాలుగు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి వేయించాలి. ఈ మిశ్రమం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, 5 ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
Tiffin Center Style Chutney
ఉల్లిపాయ ముక్కలు (Getty Images)
  • ఇప్పుడు మిక్సీజార్​లో వేయించిన పల్లీలు, ఎండుమిర్చి చింతపండు మిశ్రం, రుచికి సరిపడా ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
  • ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లో వేసి సరిపడా నీళ్లు పోసి కలపాలి.
Tiffin Center Style Chutney
వెల్లుల్లి (Getty Images)
  • అదేవిధంగా తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్​లో ఒక టీ స్పూన్ నూనె వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి. ఇందులో రెండు ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వాలి.
Tiffin Center Style Chutney
కరివేపాకు (Getty Images)
  • ఈ తాలింపును రెడీ చేసుకున్న చట్నీలో వేసి కలపాలి.
  • అంతే టిఫిన్ సెంటర్ స్టైల్ చట్నీ మీ ముందుంటుంది!
  • మీరు ఈ చట్నీని ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే పల్లీలు, ఉల్లిపాయలతో పాటు ఇతర పదార్థాలను అందుకనుగుణంగా పెంచి తీసుకోవాలి.

స్టఫింగ్ లేకుండానే "గుత్తి వంకాయ కర్రీ" - అన్నం, పులావ్, రోటీల్లోకి అద్దిరిపోద్ది!

మహా శివరాత్రి స్పెషల్ : నోరూరించే "చిలగడదుంప హల్వా" - నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది!