ETV Bharat / offbeat

తెలంగాణ స్పెషల్ "సకినాలు" - పిండి ఇలా కలిపి చేస్తే కరకరలాడుతూ అద్దిరిపోతాయి!

సూపర్ టేస్టీగా కరకరలాడే 'సకినాలు' - ఈ పద్ధతిలో బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు!

Sakinalu Recipe
Sakinalu Recipe (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : January 10, 2026 at 9:43 AM IST

3 Min Read
Choose ETV Bharat

Telangana Special Sakinalu Recipe : తెలంగాణ ఫేమస్ పిండి వంటకాల్లో సకినాలకు ఉండే క్రేజ్ వేరు. సంక్రాంతి వేళ అరిసెలు, గర్జలు, చెక్కలు వంటి వాటితో పాటు మెజార్టీ పీపుల్ 'సకినాలు' ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే, చాలా మందికి వీటిని ప్రిపేర్ చేసుకోవడం రాదు. అలాంటి వారికోసమే పొంగల్ వేళ సింపుల్​గా ప్రిపేర్ చేసుకునేలా అద్దిరిపోయే "సకినాల రెసిపీని" తీసుకొచ్చాం. ఈ పద్ధతిలో చేశారంటే సకినాలు కరకరలాడుతూ రావడమే కాకుండా మంచి రుచికరంగానూ ఉంటాయి. బిగినర్స్ కూడా ఈ టిప్స్​ ఫాలో అవుతూ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నూనె కూడా తక్కువగానే పడుతుంది! మరి, లేట్ చేయకుండా తెలంగాణ స్పెషల్ క్రిస్పీ అండ్ టేస్టీ సకినాలను ఎలా చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

Sakinalu Recipe
Sakinalu Recipe (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • బియ్యం - ఎనిమిది కప్పులు
  • నువ్వులు - ఒక కప్పు
  • వాము - ఆరు చెంచాలు
  • ఉప్పు - రుచికి తగినంత
  • నూనె - వేయించేందుకు సరిపడా

శనగపిండి లేకుండానే కరకరలాడే "జంతికలు" - నూనె తక్కువ, రుచి ఎక్కువ!

Sakinalu Recipe
Sakinalu Recipe (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా ఒక గిన్నెలో బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడగాలి. తర్వాత అందులో తగినన్ని నీళ్లు పోసి నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి.
  • బియ్యం మంచిగా నానిన తర్వాత వాటర్ వడకట్టి ఒక శుభ్రమైన క్లాత్ మీద వేసి పలుచగా పరచి కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి.
  • నీరంతా పోయి కాస్త తడిగా ఉన్నప్పుడు గిర్నీవద్దకు తీసుకెళ్లి పిండి పట్టించి తెచ్చుకోవాలి.
  • ఆ తర్వాత గిర్నీ పట్టించుకున్న పిండిని ఒక వెడల్పాటి బేషన్​లో జల్లించి తీసుకోవాలి.
Sakinalu Recipe
Sakinalu Recipe (Getty Images)
  • అనంతరం స్టవ్ మీద చిన్న కడాయి ఉంచి అందులో నువ్వులను వేసి దోరగా వేయించుకోవాలి.
  • ఆపై వాటిని జల్లించి పెట్టుకున్న బియ్యప్పిండిలో వేసుకోవాలి. అలాగే, వాము, రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుని ఒకసారి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
  • నెక్ట్స్ అందులో తగినన్ని నీళ్లను కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ మురుకుల పిండిలా తడిపి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక కాటన్ క్లాత్​ను తడిపి పలుచగా పరచి దానిపై చేతిని తడి చేసుకుని కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ వేళ్లతో పొడవుగా తిప్పుతూ రౌండ్ షేప్​లో మూడు లేదా నాలుగు చుట్లుగా చుట్టాలి.
Sakinalu Recipe
Sakinalu Recipe (Getty Images)
  • ఇదే ప్రాసెస్​లో మిగిలిన పిండి మొత్తాన్ని సకినాలుగా చేసుకోవాలి. తర్వాత వాటిని 10 నుంచి 15 నిమిషాలు గాలికి ఆరనివ్వాలి.
  • ఒకవేళ మీకు సకినాలను నేరుగా చేతితో ప్రిపేర్ చేసుకోవడం రాకపోతే జంతికల గొట్టంలో స్టార్​ గుర్తు ఉన్న బిళ్లను వేసి లోపల కొద్దిగా ఆయిల్ రాసి పిండి ముద్దను ఉంచి క్లాత్​పై సకినాల షేప్​లో ఒత్తుకున్నా సరిపోతుంది.
  • సకినాలు ఫ్రై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎలా తెలుసుకోవాలంటే, అవి కాసేపు ఆరిన తర్వాత చేతితో వాటి పైన టచ్ చేసి చూస్తే తడి ఆరినట్లుగా ఉండి, చేతికి తడి తగలకుండా ఉండాలి.
  • ఇప్పుడు స్టవ్ లేదా కట్టెల పొయ్యి మీద కడాయిలో వేయించేందుకు సరిపడా నూనె పోసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత మంటను తగ్గించి ఆరిన సకినాలను నూనె రాసిన గరిటెతో ఒక్కొక్కటి తీసుకుంటూ కాగుతున్న నూనెలో నెమ్మదిగా వేసుకోవాలి.
Sakinalu Recipe
Sakinalu Recipe (Getty Images)
  • పాన్​లో వేయించడానికి సరిపడినన్ని వేసుకున్నాక స్టవ్​ను మీడియం ఫ్లేమ్​లో ఉంచి గరిటెతో టర్న్ చేసుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి.
  • నూనెలో నురగలు తగ్గి మంచిగా వేగాయనుకున్నాక ప్లేట్​లోకి తీసుకోవాలి. ఇలానే అన్నింటిని వేయించుకోవాలి.
  • ఇక వీటిని చల్లారిన తర్వాత ఏదైనా డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే చాలు. అంతే, కరకరలాడుతూ మంచి రుచికరంగా ఉండే తెలంగాణ స్పెషల్ "సకినాలు" మీ ముందు ఉంటాయి!
  • ఇవి ఒక్కసారి చేసుకుంటే చాలా రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి!
  • మరి, నచ్చితే మీరూ పండక్కి ఇలా సింపుల్​గా సకినాలు చేసుకోండి. ఇంటిల్లిపాదీ చాలా ఇష్టంగా తింటారు.

తియ్య తియ్యగా నోరూరించే "కొబ్బరి గులాబీలు" - గరిటెకు పిండి అంటుకోకుండా ఈజీగా వస్తాయి!

నోరూరించే "బెల్లం గవ్వలు, బూందీ లడ్డూ" - పండక్కి ఇవి చేస్తే ఇంటిల్లిపాదీ ఫుల్ ఖుష్!