ETV Bharat / offbeat

చిక్కటి గ్రేవితో "సోయా కీమా కర్రీ"- ఒక్కసారి తింటే మళ్లీమళ్లీ చేసుకోవడం పక్కా!

మీల్​మేకర్​తో అద్దిరిపోయే రెసిపీ - ఇలా చేశారంటే రోటీ, రైస్​లోకి అదుర్స్!

Soya Keema Curry
Soya Keema Curry (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 5, 2026 at 4:08 PM IST

2 Min Read
Choose ETV Bharat

Meal Maker Keema Curry in Telugu : సోయా(మీల్​మేకర్​)ను వివిధ రకాల వంటల్లో ఉపయోగిస్తారు. అందుకే ఇవాళ మీకోసం ఓ సరికొత్త రెసిపీని తీసుకొచ్చాం. అదే సోయా కీమా కర్రీ. ఈ స్టెప్స్​ పాటిస్తూ ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ కర్రీ వేడివేడి అన్నంతో పాటు చపాతీ, పూరీల్లోకి సూపర్ కాంబినేషన్. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

నోట్లో వేస్తే కరిగిపోయే "అంజీర్ కలాకండ్​" - ఈ కొలతలతో చేస్తే స్వీట్ షాప్​ టేస్ట్ పక్కా!

Soya Keema Curry
సోయా (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • సోయా (మీల్​మేకర్) - 1 కప్పు
  • పచ్చిమిర్చి - 3
  • అల్లం - కొద్దిగా
  • వెల్లుల్లి - 7
  • టమోటాలు - 3
  • ఆయిల్ - 4 టేబుల్ స్పూన్లు
  • నెయ్యి - 1 టేబుల్ స్పూన్
  • బిర్యానీఆకు - 1
  • దాల్చినచెక్క - 1
  • యాలకులు - 2
  • లవంగాలు - 3
  • జీలకర్ర - 1 టీ స్పూన్
  • ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు
  • కరివేపాకు - కొద్దిగా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - పావు టీ స్పూన్
  • కారం - 2 టీ స్పూన్లు
  • ధనియాలపొడి - 1 టీ స్పూన్
  • పెరుగు - 3 టేబుల్ స్పూన్లు
  • గరంమసాలా పొడి - అర టీ స్పూన్
  • కొత్తిమీర - కొద్దిగా
  • కసూరిమెంతి - 1 టీ స్పూన్
Soya Keema Curry
ఉల్లిపాయ ముక్కలు (Getty Images)

తయారీ విధానం :

  • ముందుగా కావాల్సిన పరిమాణంలో ఉల్లిపాయలు, మూడు టమోటాలు, మూడు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే గిన్నెలో కప్పు మీల్​మేకర్​, సరిపడా వేడి నీళ్లు పోసి 10 నిమిషాల పాటు నానబెట్టాలి.
  • ఇంకోవైపు మిక్సీజార్​లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమోటా ముక్కలు, కొద్దిగా ఆల్లం ముక్కలు, ఏడు వెల్లుల్లి పాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
  • ఇదే మిక్సీజార్​లో మీల్​మేకర్​లను నీరు లేకుండా గట్టిగా పిండి వేయాలి. ఇప్పుడు వీటిని కాస్త బరకగా మిక్సీ పట్టి పక్కనుంచాలి.
Soya Keema Curry
వెల్లుల్లి (Getty Images)
  • అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. ఇవి వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చినచెక్క, రెండు యాలకులు వేయాలి. అలాగే మూడు లవంగాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయాలి.
  • ఈ మిశ్రమం వేగిన తర్వాత కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు, గ్రైండ్ చేసుకున్న టమోటా పేస్ట్ వేసి కలుపుతూ వేగనివ్వాలి.
Soya Keema Curry
పెరుగు (Getty Images)
  • ఆయిల్ సేపరెట్ అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, రెండు టీ స్పూన్ల కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి కలపాలి.
  • ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మీల్​మేకర్​ వేసి మిక్స్ చేయాలి. అనంతరం మూతపెట్టి మూడు నిమిషాల పాటు ఉడికించాలి.
Soya Keema Curry
మసాలా దినుసులు (Getty Images)
  • మూడు నిమిషాల తర్వాత గ్రేవీకి సరిపడా 250 ఎంఎల్ వరకు నీళ్లు పోసి మూతపెట్టాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి 8 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి.
  • ఎనిమిది నిమిషాల అనంతరం అర టీ స్పూన్ గరం మసాలా పొడి, కొద్దిగా కొత్తిమీర, ఒక టీ స్పూన్ కసూరిమెంతి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • అంతే వేడివేడి సోయా కీమా కర్రీ రెడీ అయినట్లే!

ఘుమఘుమలాడే "మిరియాల తమలపాకు రసం" - కమ్మటి రుచితో కడుపునిండా తినేస్తారు!

బంగాళదుంపతో కరకరలాడే "చెగోడీలు" - నూనె పీల్చకుండా క్రిస్పీగా, క్రంచీగా వస్తాయి!