పాకం అవసరం లేని "జొన్న లడ్డూలు" - చాలా టేస్టీగా ఉంటాయి - హెల్త్‌కు మంచిది!
- నోట్లో వేసుకోగానే కరిగిపోయే లడ్డూలు! - ఈ పద్ధతిలో చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు!

Published : March 4, 2026 at 11:09 AM IST
Tasty Jowar Laddu : మెజార్టీ పీపుల్ ఇష్టంగా తినే స్వీట్స్‌లలో లడ్డూలు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాయి. తియ్యగా ఉండి నోట్లో వేసుకోగానే కరిగిపోయే వీటిని పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. అయితే లడ్డూలు అనగానే చాలా మందికి బూందీ లడ్డూలు గుర్తుకువస్తాయి. కానీ ఆరోగ్యానికి మేలు చేసే జొన్న పిండితో కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండే వీటిని అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోతాయి. పాకం అవసరం లేకుండా చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకు రోజుకొకటి ఇచ్చారంటే చాలా హెల్దీగా తయారవుతారు. మరి జొన్న లడ్డూలు ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు :
- నెయ్యి - పావు కప్పు
- జీడిపప్పులు - గుప్పెడు
- బాదం పప్పులు - 20
- పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు
- ఎండుకొబ్బరి ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
- జొన్న పిండి - 1 కప్పు
- బెల్లం తురుము - 1 కప్పు
- యాలకులు - 4

తయారీ విధానం :
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి వేడి చేసుకోవాలి.
- కాగిన నెయ్యిలో జీడిపప్పులు, బాదం పప్పులు, పల్లీలు, ఎండుకొబ్బరి ముక్కలు వేసి లో-ఫ్లేమ్‌లో కలుపుతూ వేయించాలి.
- ఈ డ్రైఫ్రూట్స్ మంచిగా వేగినాక ఓ గిన్నెలోకి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి.
- అదే నెయ్యిలో జొన్న పిండి వేసి సిమ్‌లోనే ఫ్రై చేయాలి.

- జొన్న పిండి నెయ్యిలో కలిసి పచ్చి వాసన పోయి లైట్‌గా కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఓ ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి.
- మిక్సీజార్‌లోకి వేయించిన పల్లీల మిశ్రమం వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి.

- ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వెడల్పాటి ప్లేట్లోకి తీసుకోవాలి.
- అదే మిక్సీజార్‌లోకి వేయించిన జొన్న పిండి, బెల్లం తురుము, యాలకులు వేసి మధ్యమధ్యలో కలుపుతూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పల్లీ పొడి ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి.
- అనంతరం రెండూ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత కొద్దికొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి.
- ఇలా మిశ్రమం మొత్తాన్ని లడ్డూలుగా చేసుకున్నాక గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరి.
- ఎంతో టేస్టీగా ఉండే జొన్న పిండి లడ్డూలు రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- జొన్న పిండిని లైట్‌గా కలర్ మారి, మంచి వాసన వచ్చేవరకు లో-ఫ్లేమ్‌లో మాత్రమే వేయించుకోవాలి.
- పిండి మాడిందంటే లడ్డూల రుచీ మారుతుంది.
- మీరు ఎంత పరిమాణంలో చేసుకున్న జొన్న పిండి, బెల్లం ఒకే కొలతగా తీసుకోవాలి. అప్పుడే వాటి రుచి బాగుంటాయి.
- ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే బెల్లం కాస్త పెంచి తీసుకోవచ్చు.
- ఈ లడ్డూలు చేసుకోవడానికి కాస్త నెయ్యి ఎక్కువే అవసరం ఉంటుంది. కాబట్టి చూసి యాడ్ చేసుకోండి.
నారింజ తొక్కలతో "క్యాండీలు" - సూపర్ టేస్టీగా ఉంటాయి - 3 నెలలు నిల్వ!
క్రిస్పీ అండ్ జ్యూసీ "మష్రూమ్ కట్లెట్స్" - టేస్ట్ అద్దిరిపోతాయి - స్నాక్స్‌కు బెస్ట్!

