ETV Bharat / offbeat

నోరూరించే కమ్మని "కొబ్బరి బూరెలు" - ఇలా చేస్తే పర్ఫెక్ట్​గా వస్తాయి!

కొబ్బరి బూరెలు ఇలా ఓసారి చేసి చూడండి! - చాలా బాగుంటాయి

Kobbari Burelu
Kobbari Burelu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : October 25, 2025 at 11:04 AM IST

2 Min Read
Choose ETV Bharat

Kobbari Burelu Making in Telugu : చాలా ఇండ్లలో బూరెలను చేస్తారు. కమ్మగా, మెత్తగా ఉండే ఇవ్వంటే అందరికి ఇష్టమే. కానీ కొన్నిసార్లు ఇవి చేసినప్పుడు సరిగ్గా పాకం కుదరకపోవడం లేదా మిశ్రమంతా బయటకు రావడం లాంటివి జరుగుతాయి. ఇప్పుడు చెప్పబోయే ఓసారి కొబ్బరిని ఉపయోగించి ఇలా చేశారంటే సూపర్​గా వస్తాయి. కేవలం నిమిషాల్లోనే దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి బూరెలు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా?

ఫేవరెట్ బ్రేక్​ఫాస్ట్ "పెరుగు వడ" - ఇలా చేస్తే ఎంతో మృదువుగా, టేస్టీగా ఉంటుంది!

Kobbari Burelu
బియ్యం (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • బియ్యం - 1 కేజీ
  • పచ్చికొబ్బరి ముక్కలు - 2 కప్పులు
  • బెల్లం - 600 గ్రాములు
  • యాలకుల పొడి - 1 టీ స్పూన్
  • నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
  • నూనె - సరిపడినంతా
Kobbari Burelu
బెల్లం (Getty Images)

తయారీ విధానం :

  • ముందుగా గిన్నెలో ఒక కేజీ బియ్యం తీసుకొని మూడు సార్లు బాగా కడగాలి. ఆ తర్వాత సరిపడా నీళ్లు పోసి కనీసం 20 గంటల పాటు నానబెట్టాలి. అయితే మధ్యలో నీళ్లు మారుస్తూ ఉండాలి.
  • 20 గంటల తర్వాత బియ్యంలో నీళ్లు తీసేసి ఓ పొడి క్లాత్ మీద బియ్యాన్ని పర్చుకోని కాస్త 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. అనంతరం బియ్యాన్ని మిక్సీజార్​లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరోసారి బియ్యప్పిండిని జల్లెడ పట్టుకోవాలి.
  • అదేవిధంగా మిక్సీజార్​లో రెండు కప్పుల పచ్చికొబ్బరి ముక్కలు వేసి మిక్సీ పట్టాలి.
Kobbari Burelu
కొబ్బరి (Getty Images)
  • ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెలో 600 గ్రాముల బెల్లం, ఒక కప్పు నీళ్లు పోయాలి. బెల్లం కరిగిన తర్వాత ఆ వాటర్​ను జాలితో మరో గిన్నెలో వడగట్టాలి.
  • మళ్లీ స్టవ్ ఆన్ చేసి బెల్లం వాటర్​ను పాకం వచ్చే వరకు మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి ఉడికించాలి.
  • ఆ తర్వాత బెల్లం పాకంలో గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అదేవిధంగా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మిక్స్ చేయాలి. పాకం కాస్తా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
  • అనంతరం బెల్లం పాకంలో గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యప్పిండిని వేసి కలపాలి. ఆ తర్వాత కొద్దిగా నెయ్యి వేసి కలిపి మూతపెట్టి కాస్తా చల్లారనివ్వాలి.
Kobbari Burelu
నెయ్యి (Getty Images)
  • మరోవైపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్​ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. నూనె వేడైన తర్వాత పిండిని కొంచెం కొంచెం తీసుకొని పాలిథీన్ కవర్ లేదా బటర్ పేపర్ లేదా అరిటాకు మీద కాస్తా నెయ్యి అప్లై చేసి అరిసె మాదిరిగా చేయాలి.
  • ఆ తర్వాత అరిసెలను నూనెలో వేసి అటూఇటూ టర్న్​ చేస్తూ వేగనివ్వాలి.
Kobbari Burelu
యాలకుల పొడి (Getty Images)
  • ఇవి బాగా పొంగిన తర్వాత ప్లేట్​లో సర్వ్ చేసుకోవడమే.
  • ఇక అంతే టేస్టీటేస్టీ కొబ్బరి బూరెలు మీ ముందుంటాయి!
  • ఇలా ఓసారి ఇంట్లో చేసి పెడితే పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు.

"దేవీ నవరాత్రుల స్పెషల్ రెసిపీ" - అమ్మవారికి ఇష్టమైన "కొబ్బరన్నం, అల్లం గారెలు"

ఫేవరెట్ బ్రేక్​ఫాస్ట్ "పెరుగు వడ" - ఇలా చేస్తే ఎంతో మృదువుగా, టేస్టీగా ఉంటుంది!