ETV Bharat / offbeat

కరకరలాడే "బ్రెడ్​ వడలు" - ఇన్​స్టంట్​గా చేసుకోవచ్చు - టేస్ట్​ కిర్రాక్​ అంతే!

- బ్రెడ్​తో అప్పటికప్పుడు చేసుకునే కిర్రాక్ రెసిపీ - పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు!

Tasty Bread Vada Recipe
Tasty Bread Vada Recipe (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : October 27, 2025 at 2:40 PM IST

3 Min Read
Choose ETV Bharat

Tasty Bread Vada Recipe: బ్రెడ్​ దాదాపు అందరి ఇళ్లల్లో ఉంటుంది. మార్నింగ్​ టిఫెన్​ చేసే టైమ్​ లేనప్పుడు చాలా మంది ఆల్టర్​నేట్​గా బ్రెడ్​ను సెలెక్ట్​ చేసుకుంటుంటారు. ఇక దీనితో ఆమ్లెట్​, టోస్ట్​ ప్రిపేర్​ చేస్తుంటారు. లేదంటే బ్రెడ్​పై జామ్​ లేదా పీనట్​ బటర్​ అప్లై చేసి నేరుగా తినేస్తుంటారు. అయితే ఎప్పుడూ వీటినే తినాలంటే బోర్​ కొడుతుంది. ఇక పిల్లలు అయితే వద్దని మారాం చేస్తుంటారు. అందుకే మీకోసం అద్దిరిపోయే రెసిపీ తీసుకొచ్చాం. అదే బ్రెడ్​ వడలు. మీరు విన్నది నిజమే. ఇంట్లో మిగిలిపోయిన బ్రెడ్​తో ఎంచక్కా వడలు చేసుకోవచ్చు. పైన క్పిస్పీగా, లోపల సాఫ్ట్​గా ఉంటాయి. మరి లేట్​ చేయకుండా కమ్మని బ్రెడ్​ వడలు ఎలా చేయాలో చూసేయండి.

Tasty Bread Vada
బ్రెడ్​ (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

  • బ్రెడ్​ స్లైస్​లు - 6
  • బొంబాయి రవ్వ - పావు కప్పు
  • బియ్యప్పిండి - అర కప్పు
  • పెరుగు - ముప్పావు కప్పు
  • ఉల్లిపాయ - 1
  • అల్లం ముక్క - చిన్నది​
  • పచ్చిమిర్చి - 2
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • కొత్తిమీర - కొద్దిగా
  • జీలకర్ర - 1 టీస్పూన్​
  • ఉప్పు - రుచికి సరిపడా
Tasty Bread Vada
బియ్యప్పిండి (Getty Images)

తయారీ విధానం:

  • ఇన్​స్టంట్​ వడల కోసం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను వీలైనంత సన్నగా కట్​ చేసుకోవాలి. అల్లంపై పొట్టు తీసేసి వీలైనంత మెత్తని పేస్ట్​లా చేసుకోవాలి.
  • అలాగే బ్రెడ్​ స్లైస్​లను సన్నని ముక్కలుగా కట్​ చేసుకోవాలి. మిక్సింగ్​ బౌల్​లోకి కట్​ చేసిన బ్రెడ్​ ముక్కలు వేసుకోవాలి.
  • ఆపై అందులోకి రవ్వ, బియ్యప్పిండి, పెరుగు, ఉల్లిపాయ తరుగు, అల్లం పేస్ట్​, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తని ముద్దలా కలుపుకోవాలి. బ్రెడ్​ ముక్కలను ప్రెస్​ చేస్తూ కలుపుకోవడం వల్ల మిశ్రమం మొత్తం సాఫ్ట్​గా, ముద్దలాగా వస్తుంది.
  • పిండిని పర్ఫెక్ట్​గా మిక్స్​ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఓ 5 నిమిషాలు పక్కన పెట్టాలి.
Tasty Bread Vada
పెరుగు (Getty Images)
  • ఈలోపు స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి డీప్​ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • ఆయిల్​ కాగేలోపు కలుపుకున్న చేతికి కాస్త నూనె రాసి పిండిని కొద్దిగా తీసుకుని ఫస్ట్​ రౌండ్​గా చేసుకోవాలి. ఆ తర్వాత అరచేతిలో సమానంగా వత్తుకుని మధ్యలో హోల్​ పెట్టి ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి. ఇలానే మిగిలిన పిండి మొత్తాన్ని వడల షేప్​లో వత్తుకుని పక్కన పెట్టుకోవాలి.
  • నూనె కాగిన తర్వాత మంటను కాస్త తగ్గించి ప్రిపేర్​ చేసుకున్న వడలను నూనెలో వేసుకోవాలి.
  • కడాయికి సరిపడా వేసుకున్న తర్వాత గరిటెతో వెంటనే తిప్పకుండా ఓ రెండు నిమిషాలు అలానే వేగనిచ్చి, అప్పుడు నిధానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
Tasty Bread Vada
ఉల్లిపాయలు (Getty Images)
  • రెండు వైపులా వేగి క్రిస్పీగా మారిన తర్వాత టిష్యూ పేపర్​ ఉన్న ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇలానే మిగిలిన వాటిని కూడా ఆయిల్​లో వేసి వేయించుకుని ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇలా అన్నింటిని వేయించుకున్న తర్వాత ప్లేట్​లోకి తీసుకుని నచ్చిన చట్నీతో సర్వ్​ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్​ వడలు రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Tasty Bread Vada
బ్రెడ్​ వడలు (Eenadu)

చిట్కాలు:

  • మిల్క్​ బ్రెడ్​ లేదా బ్రౌన్​ బ్రెడ్​ ఏదైనా వాడొచ్చు. ఒక వేళ బ్రెడ్​లోని బ్రౌన్​ పార్ట్​ వద్దనుకుంటే దానిని రిమూవ్​ చేసి ఆ తర్వాత ముక్కలుగా చేసుకోవచ్చు.
  • వడలు టేస్టీగా రావాలంటే పుల్లటి పెరుగు అయితే పర్ఫెక్ట్​గా ఉంటుంది. అలాగే కేవలం ఉల్లిపాయ, పచ్చిమిర్చి మాత్రమే కాకుండా క్యారెట్​ తురుము కూడా వేసుకోవచ్చు.
  • వడలను కేవలం మీడియం ఫ్లేమ్​లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి.

టేస్టీ "క్వినోవా కట్​లెట్స్​" - అప్పటికప్పుడు చేసుకోవచ్చు - డీప్​ఫ్రైతో పనిలేదు!

ఇది పిజ్జా కాదు అద్భుతమైన "ఫ్రిటాటా"! - రెస్టారెంట్​ ఫ్లేవర్​ ఇంట్లోనే!